నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు – మమత బెనర్జీ

  • Publish Date - November 2, 2019 / 01:20 PM IST

వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ సంచలన కామెంట్స్ చేశారు. కేంద్రం తన ఫోన్ ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం ఏవీ సేఫ్‌గా లేవని..ఈ విషయంలో ప్రధాని దర్యాప్తు జరపాలని డిమాడ్ చేశారు. సీఎం బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులందరిపై గూఢచర్యం చేస్తున్నారని తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాజకీయ నాయకుల  ఫోన్ ట్యాప్ చేయబడుతోందని, కేంద్రం, రెండు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జరుగుతోందని ఆరోపించారు.

కానీ ఆ రాష్ట్రానికి పేరు పెట్టనని, రెండింటిలో బీజేపీ పాలించిన రాష్ట్రమన్నారు. ఈ సంగతంతా ప్రభుత్వానికి పూర్తిగా తెలుసన్నారు. రాజకీయ నేతలు, మీడియా, జడ్జీలు, ఐఏఎస్/ఐపీఎస్, సామాజిక వేత్తలు, ఇతర ప్రముఖుల వ్యక్తుల కార్యకలాపాలు గుర్తించడానికి ఇజ్రాయిల్ కంపెనీ NSO ఉపయోగిస్తోందన్నారు. ఇలా చేయడం చాలా తప్పన్నారు. ప్రజల గోప్యతను హరించే హక్కు లేదన్నారు. 

కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వంపై మమత విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు యుద్ధ వాతావరణం సృష్టించాలని బీజేపీ అనుకుందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మోడీ – అమిత్ షా చేతుల్లో కేంద్రం నడుస్తోందని, నియంతృత్వ మోడీని గద్దెదించుతామని, విచిత్ర రీతిలో పరిపాలన కొనసాగిస్తోందన్నారు. తాజాగా మమత చేసిన ఆరోపణలపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. 
Read More : రంజుగా మహా రాజకీయం : శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది