రాకెట్ పట్టిన దీదీ : స్మాష్ లతో వైరల్..

  • Publish Date - January 5, 2019 / 05:56 AM IST

కోల్‌కతా: పశ్చిమ్‌ బంగా‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాకెట్ పట్టారు. రాజకీయాల్లో బిజీగా వుండే 63 ఏళ్ల దీదీ సరదా సరదాగా షటిల్ ఆడారు. బిర్‌భుమ్‌ జిల్లా బోల్‌పుర్‌లోని  గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో జనవరి 4న  మరో ముగ్గురితో కలిసి డబుల్స్ ఆడిన దీదీ స్మాష్ లతో అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజకీయాల్లోనే కాదు బ్యాడ్మింటన్‌ ఆటలోనూ తన స్టైల్ ను చూపించారు. మమత ఆడిన ఆటను తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుడు ఈ  వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో దీదీ షటిల్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. 63 ఏళ్ల వయస్సులో హెల్దీగా..హుషారుగా షటిల్ ఆడిన దీదీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.