Movie Offer
Movie Offer: సినిమాల్లో నటించాలనే పిచ్చి గొంతుకోసుకునేలా చేసింది. చివరకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కించింది. వివరాల్లోకి వెళితే తమిళనాడు కాంచీపురం జిల్లా సుంగువాసత్రం సంతవేలూరు గ్రామానికి చెందిన శంకరలింగం కుమారుడు మారిముత్తు. యితడు తిరువళ్లూరు జిల్లాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతని తమ్ముడు చెన్నైలో ఉంటూ సినిమా ఆఫర్ల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇక అన్న మారిముత్తు రోజు ఆఫీసులు వెళ్తుంటాడు.
శుక్రవారం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన మారిముత్తు గొంతుకోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. శనివారం 10 గంటలు అవుతున్న ముత్తు ఇంట్లోనుంచి రాకపోవడం, ఇంట్లోంచి రక్తపు వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి రక్తపు మడుగులో ఉన్న మారిముత్తును ఆసుపత్రికి తరలించారు. స్పృహలోకి రాగానే పోలీసులు అతడిని విచారించారు. పొంతనలేని సమాధానం చెబుతుండటంతో పోలీసులకు అనుమానం కలిగింది.
తమదైన శైలిలో విచారణ చేశారు. దీంతో అసలు విషయం బయటపెట్టాడు. సినిమాల్లో అవకాశం రావాలంటే చనిపోకుండా ఉండేలా గొంతుకోసుకోవాలని సుచినట్లు తెలిపాడు. తన సోదరుడు చెప్పినట్లే గొంతుకోసుకున్నానని.. ఆ వీడియోను తన సోదరుడికి పంపానని.. అతడు దానిని సోషల్ మీడియాలో వైరల్ చేశాడని తెలిపాడు. మారిముత్తు సమాధానం విన్న పోలీసులు కంగుతున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతడిని స్టేషన్ కు తరలించారు.
ముత్తు తమ్ముడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అవకాశాల కోసం ఇలా బ్లాక్మెయిల్ చెయ్యడం చట్టరీత్య నేరమని పోలీసులు హెచ్చరించారు.