Auto Driver : రెండు చక్రాలపై ఆటో నడిపి గిన్నీస్‌ రికార్డు సాధించిన ఆటో డ్రైవర్

2015లో ఆటో డ్రైవర్ చేసిన సాహసం తాజాగా గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించింది. ఆటోను రెండు చక్రాలపై 2.2కిలోమీటర్ల దూరం నడిపి రికార్డు క్రియేట్ చేశాడు.

Auto Driver : గిన్నీస్‌ బుక్ లో చోటు సంపాదించాలని చాలామంది తహతహలాడుతుంటారు. ఎవరు చేయని విన్యాసాలు చేస్తారు. కొత్త కొత్త సాహసకృత్యాలు చేస్తూ అందరిని అక్కట్టుకోవడమే కాకుండా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటుదక్కించుకుంటారు. అయితే 2015లో ఓ ఆటో డ్రైవర్ చేసిన సాహసం.. తాజాగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కింది. తమిళనాడుకు చెందిన ఆటో డ్రైవర్ జగదీష్ మణి 2015లో ఆటోను రెండు చక్రాలపై నడిపాడు. అలా మొత్తం 2.2 కిలోమీటర్ల దూరం నడిపి… గిన్నీస్‌ బుక్ రికార్డ్ సాధించాడు.

Read More :  గిన్నిస్‌‌లోకి జెఫ్‌ బెజోస్‌ ‘బ్లూ ఆరిజిన్‌’.. మరో 4 రికార్డులు కూడా..!

రెండు చక్రాలపై ఆటో నడిపి రికార్డు సృష్టించాడు జగదీష్. చెన్నైకి చెందిన ఆటో-రిక్షా డ్రైవర్ జగదీష్ ఇలా ఆటోను సైడ్‌కి నడిపి రికార్డ్ సృష్టించాడు” అని క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. గతంలో కూడా రెండు చక్రాలపై ఆటో నడిపినవారు ఉన్నారు.. కానీ 2 కిలోమీటర్లకు పైగా రెండు చక్రాలపై నడిపింది మాత్రం జగదీష్ ఒక్కరే. ఈ సందర్భంగా జగదీష్‌ మణి మాట్లాడుతూ.. “ఇలాంటి రికార్డ్ సాధిస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు వారు నా టాలెంట్‌ని గుర్తించినందుకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారికి కృతజ్ఞతలు’’ అన్నారు.

Read More :   ఉల్లిపాయలాంటి చిన్నది..ఒక్క నిమిషంలో ఎన్నిడ్రెస్సులు మార్చిందో

 

ట్రెండింగ్ వార్తలు