రాజస్తాన్ లో మౌంట్ అబూలో నవరాత్రి ఉత్సవాల్లో విషాదం చోటు చేసుకుంది. గార్బా ఆడుతూ ఓ వ్యక్తి కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే చనిపోయాడు. గుజరాతీ కుటుంబానికి చెందిన
రాజస్తాన్ లో మౌంట్ అబూలో నవరాత్రి ఉత్సవాల్లో విషాదం చోటు చేసుకుంది. గార్బా ఆడుతూ ఓ వ్యక్తి కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే చనిపోయాడు. మృతుడిని గుజరాతీ కుటుంబానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడి పేరు జగదీష్. గుజరాత్ నుంచి రాజస్తాన్ కి టూర్ కోసం వచ్చాడు. కుటుంబంతో కలిసి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నాడు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి ఆనందంగా గార్బా డ్యాన్స్ చేస్తున్నారు. చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేస్తున్నారు.
ఇంతలో ఏం జరిగిందో కానీ.. జగదీష్ కుప్పకూలాడు. నోట్లో నుంచి రక్తం వచ్చింది. వెంటనే బంధువులు జగదీష్ ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనతో కుటుంబసభ్యులు షాక్ తిన్నారు. అసలేం జరిగిందో తెలియక కంగారుపడ్డారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. జగదీష్ మృతికి కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక మరణానికి కారణాలు తెలుస్తాయని చెబుతున్నారు.
గుజరాత్ రాష్ట్రం సూరత్ నుంచి 6 జంటలు టూర్ లో భాగంగా మౌంట్ అబూకి వచ్చాయి. మౌంట్ అబూలో రెండు రోజుల ట్రిప్ కి ప్లాన్ చేశారు. అంతా కలిసి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. గార్బా డ్యాన్సులు చేస్తున్నారు. ఇంతలో తీరని విషాదం చోటు చేసుకుంది. జగదీష్ హఠానర్మణం అందరిని షాక్ కి గురి చేసింది.