Bihar : రియల్ లైఫ్‌లో హమ్ దిల్ దే చుకే సనమ్? భార్యకి ప్రియుడితో పెళ్లి చేసిన భర్త

పెళ్లయ్యాక భార్యకి గతంలో ఓ లవ్ స్టోరి ఉంది.. ఇప్పటికీ ఆమె అతడిని కలుస్తోంది అంటే ఏ భర్తైనా ఊరుకుంటాడా? కానీ ఓ భర్త తన భార్యకు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేశాడు. బీహార్‌లో జరిగిన ఈ ఘటన వైరల్ అవుతోంది.

Bihar

Bihar : 1999 లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ‘హమ్ దిల్ దే చుకే సనమ్’. ఈ సినిమాలో భార్యను తను ప్రేమించిన వ్యక్తితో కలపడానికి సిద్ధపడతాడు భర్త. కానీ ఇప్పుడు చెప్పబోయే కథ క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఉంది. అదేంటో మీరే చదవండి.

Love Marriage : ప్రేమ పెళ్లి తెచ్చిన తంటా

బీహార్ నవాడా జిల్లాలో భార్యాభర్తలు ఉంటున్నారు అయితే భార్యకు గతంలో ఓ లవ్ స్టోరీ ఉందని ఇటీవలే బట్టబయలైంది. భర్త పని మీద బయటకు వెళ్లిన సమయంలో అర్ధరాత్రి వేళ ప్రియుడిని కలిసేందుకు ఆమె అతని ఇంటికి వెళ్లింది. అంతే వీరి వ్యవహారం బట్టబయలైంది. ఇద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న కుటుంబ సభ్యులు చితక్కొట్టారు. చెట్టుకు కట్టేశారు. గ్రామస్తులు గ్రామం విడిచి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చారు. విషయం మహిళ భర్తకు చేరింది. ఇక వ్యవహారం అంతా పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతుందని అందరూ ఊహించారు.  కానీ ఇక్కడ సీన్ రివర్స్. ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ సినిమాకు దగ్గరగా ఉన్నా సినిమా క్లైమాక్స్ మారిపోయింది. భార్యకి ఆమె ప్రియుడితో శివాలయంలో దగ్గర్నుండి పెళ్లి చేశాడు ఆమె భర్త. ఒంటిపై గాయాలతో ఉన్న  ప్రియుడు ఆమె నుదుటిపై సింధూరాన్ని పూయడంతో ఆ మహిళ బిగ్గరగా ఏడుస్తూ కనిపించింది. పబ్లిక్‌లో జరిగిన ఈ పెళ్లితంతు చూసి గ్రామస్తులు ముక్కున వేలేసుకున్నారు.

Amazing gift : ఓ భార్యకు భర్త ఇచ్చిన బహుమతి చూసి ప్రేమంటే ఇదే.. అంటున్న నెటిజన్లు

కొద్దిసేపటికి విషయం సద్దుమణిగింది. అయితే ఆ మహిళ  ప్రియుడు కూడా వివాహితుడు అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతని భార్య నుంచి ఎటువంటి కంప్లైంట్ రాలేదని పోలీసులు చెబుతున్నారు. అసలు ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు కూడా నమోదు కాలేదట. సినిమా కంటే ఉత్కంఠగా సాగిన వీరి కథ ఇకపై ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.