కొంతమంంది చిన్న చిన్న సమస్యలకే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. ఇలాగే ఓ వ్యక్తి చేసిన కంప్లైట్ చూసి పోలీసులు షాక్ తిన్నారు. గిదేందిరా బాబు..అంటే అది గంతే అంటున్నాడు. ఏమని ఫిర్యాదు చేశాడో తెలుసా ? బట్టలు కుట్టే వ్యక్తి నిక్కర్ చిన్నగా కుట్టాడని అతనిపై చర్యలు తీసుకోవాలని కంప్లైట్ ఇచ్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఓ టైలర్ దుకాణానికి వెళ్లానని భోపాల్ కు చెందిన కుమార్ దూబే వెల్లడించాడు. అక్కడ రెండు మీటర్ల బట్ట టైలర్ కు ఇచ్చి..నిక్కర్ కుట్టాలని కోరినట్లు తెలిపాడు. అతను చెప్పిన రోజు వెళ్లి చూస్తే..నిక్కర్ మరీ చిన్నదిగా కుట్టాడన్నారు. దీనిని సరి చేసి ఇవ్వాలని అడిగితే..నో చెప్పాడన్నారు.
అందుకోసం పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. నిక్కర్ కుట్టేందుకు తన వద్దనుంచి రూ. 70 వసూలు చేశాడని, లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన తమకు రెండు పూటల తిండి దొరకడం కష్టంగా మారిందన్నారు.
ఈ క్రమంలో టైలర్ చేసిన పనికి తనకు చాలా నష్టం జరిగిందని, తనకు న్యాయం చేయాలని కోరాడు. దూబే ఇచ్చిన కంప్లైట్ తీసుకున్న పోలీసులు..స్థానికంగా ఉన్న న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచించారు.