Shocking Video: రైలు దిగుతూ పడిపోయిన ప్రయాణికుడు.. కాపాడిన పోలీస్!

కదులుతున్న రైలులో ఎక్కరాదు.. నడుస్తున్న రైలు నుంచి దిగరాదు.. ఫ్లాట్‌ఫామ్‌పై ట్రాక్‌కు దగ్గరగా నిలబడరాదు.. అంటూ రైల్వేశాఖ ఎన్ని సూచనలు చేస్తున్నా కూడా ఇప్పటికీ చాలామంది వాటిని పెడచెవినబెట్టి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూనే ఉంటారు.

Mumbai’s Borivali Railway Station: కదులుతున్న రైలులో ఎక్కరాదు.. నడుస్తున్న రైలు నుంచి దిగరాదు.. ఫ్లాట్‌ఫామ్‌పై ట్రాక్‌కు దగ్గరగా నిలబడరాదు.. అంటూ రైల్వేశాఖ ఎన్ని సూచనలు చేస్తున్నా కూడా ఇప్పటికీ చాలామంది వాటిని పెడచెవినబెట్టి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూనే ఉంటారు. అటువంటి ఘటనలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతూ ఉంది. ముంబై నగరంలో రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘటన లేటెస్ట్‌గా వెలుగులోకి వచ్చింది.

ముంబైలోని బోరివల్లి రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి నడుస్తోన్న రైలులో నుంచి దిగేందుకు ప్రయత్నించగా ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న రైలులో నుంచి దిగుతూ బ్యాలెన్స్ తప్పి సదరు వ్యక్తి కింద పడిపోయాడు. రైలుకు, ఫ్లాట్‌ఫామ్‌కు మధ్య ఉన్న గ్యాప్‌లో పడిపోగా.. వెంటనే అలర్ట్ అయిన అక్కడి రైల్వే పోలీస్ కానిస్టేబుల్అతని వైపుగా పరిగెత్తి, రైలుకు దూరంగా లాగడంతో ప్రమాదం తప్పింది.

దీనికి సంబంధించిన సీసీఫుటేజ్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న రైల్వేశాఖ.. ప్రయాణికులు ఇటువంటి పనులు చెయ్యరాదు అని హెచ్చరించింది. దీనిని నేరంగా కూడా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆ వ్యక్తిని కాపాడిన పోలీస్ కానిస్టేబుల్‌ను అభినందించింది.

ట్రెండింగ్ వార్తలు