పాల ప్యాకెట్ కోసం వస్తే కర్రతో చితకబాదిన ఫేక్ పోలీస్

  • Publish Date - April 29, 2020 / 09:49 AM IST

కరోనావైరస్ డ్యూటీలో ఉన్న పోలీసునంటూ వీరంగం చేయడమే కాకుండా పాల ప్యాకెట్ కోసం బయటికొచ్చిన వ్యక్తిని చితకబాదాడో వ్యక్తి. అతనికి తోడుగా మరో వ్యక్తి చేరడంతో ఇద్దరి చేతిలో చావుదెబ్బలు తిన్నాడు. ఈ ఘటన అహ్మదాబాద్ లోని నరోడా ప్రాంతంలో జరిగింది. బాధితుడు ఖుశాల్ పర్మార్ వారిలో ఒకరు పోలీస్ యూనిఫామ్ వేసుకున్నట్లుగా చెప్తున్నాడు. 

ఇంట్లో పాల ప్యాకెట్ తీసుకురమ్మన్నారని ఖుశాల్ బయటికొచ్చాడు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పై వచ్చారు. కరోనావైరస్ లాక్ డౌన్ సమయంలో బయటికెందుకు వచ్చావని ప్రశ్నించారు. తాను పాలు కోసం వచ్చానని చెప్తున్నప్పటికీ కింద పడేసి కర్రలతో బాదారు. ఇంటికి తిరిగి వెళ్లాక గానీ తెలియలేదు తాను దెబ్బలు తిన్నది ఫేక్ పోలీసులతోనని. 

ఇంటిపక్కన వ్యక్తులు కూడా ఇద్దరి చేతిలో దెబ్బలు తిన్నామని వారిలో ఒకరు పోలీస్ యూనిఫాంలో ఉన్నారని చెబుతున్నారు. వారంతా కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. నారోదా పోలీస్ స్టేషన్ లో ఉన్న సీనియర్ అధికారి.. దగ్గరి ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశఈలిస్తున్నారు. ఫిర్యాదు మేర కంప్లైంట్ నమోదు చేసుకున్నారు.