కోర్టు ఆవరణలో కలకలం: బ్లేడ్ తో చేయి కోసుకున్న వ్యక్తి

సుప్రీంకోర్టు ఆవరణలో కలకలం రేగింది. ఓ వ్యక్తి బ్లేడ్ తో చేయి కోసుకున్నాడు. ఒకవైపు గాయమైన చేతి నుంచి రక్తం కారుతున్నప్పటికీ.. ఓ కాగితాన్ని పట్టుకుని కోర్టు ఆవరణలో ఉన్న మీడియాకు చూపిస్తూ కనిపించాడు.

  • Publish Date - April 12, 2019 / 06:01 AM IST

సుప్రీంకోర్టు ఆవరణలో కలకలం రేగింది. ఓ వ్యక్తి బ్లేడ్ తో చేయి కోసుకున్నాడు. ఒకవైపు గాయమైన చేతి నుంచి రక్తం కారుతున్నప్పటికీ.. ఓ కాగితాన్ని పట్టుకుని కోర్టు ఆవరణలో ఉన్న మీడియాకు చూపిస్తూ కనిపించాడు.

సుప్రీంకోర్టు ఆవరణలో కలకలం రేగింది. కోర్టులోకి ప్రవేశించిన ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. శుక్రవారం (ఏప్రిల్ 12, 2019) ఉదయం బ్లేడ్ తో తన చేయి కోసుకున్నాడు. ఒకవైపు గాయమైన చేతి నుంచి రక్తం కారుతున్నప్పటికీ.. అదే చేతిలో కాగితాన్ని పట్టుకుని కోర్టు ఆవరణలో ఉన్న న్యాయవాదులకు చూపిస్తూ కనిపించాడు. న్యాయవాదుల ముందే చేయి కోసుకుని న్యాయం చేయాలంటూ హంగామా చేశాడు. 

అప్రమత్తమైన భద్రతా సిబ్బందిని అతన్ని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అతడు కిందపడిపోగా.. రక్తం కారుతున్న చేతికి హ్యాండ్ కర్ఛీఫ్ కట్టారు. అనంతరం  భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

సుప్రీం ఆవరణలో చేయి కోసుకున్న వ్యక్తి ఎవరూ అనేది ఇంకా వివరాలు తెలియలేదు. తన చేతిని ఎందుకు కోసుకున్నాడో కూడా కారణం తెలియలేదు. భద్రతా అధికారులు అతన్ని విచారిస్తున్నారు. కోర్టులో కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి ఫొటోలను న్యూస్ ఏజెన్సీ ట్విట్టర్ లో పోస్టు చేయడంతో వైరల్ అవుతున్నాయి.