Madhya Pradesh, : ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు..అనుమానంతో భార్య చేతులు నరికివేశాడు

అనుమానం అనే పెనుభూతం వారి సంసారంలో చిచ్చు రేపింది. భార్యపై ఓ భర్త అనుమానం పెంచుకున్నాడు.

Suspects Wife's 'character'

Man suspects wife’s ‘character : అనుమానం అనే పెనుభూతం వారి సంసారంలో చిచ్చు రేపింది. భార్యపై ఓ భర్త అనుమానం పెంచుకున్నాడు. అనుమానం పెనుభూతమై..ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండు నెలలకే భార్య చేతులు నరికివేశాడు. అత్యంత దారుణమైన ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రణధీర్ అనే వ్యక్తి..ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహానికి యువతి కుటుంబసభ్యులు అంగీకరించలేదు. అయితే..గత పదిహేను రోజుల నుంచి భార్యపై రణధీర్ అనుమానం పెంచుకున్నాడు. ప్రతి రోజు వేధింపులకు గురి చేసేవాడు.

ఈ క్రమంలో…కట్టెలు తెచ్చుకుందామని..సోమవారం భార్యను తీసుకని అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అనంతరం తెచ్చుకున్న గొడ్డలితో ఆమె రెండు చేయిలు నరికివేశాడు. తీవ్ర రక్తస్రావంతో బాధ పడుతున్న ఆమెను..కొంతమంది హమిదియా ఆసుపత్రికి తరలించారు. తొమ్మిది గంటల పాటు…ఆపరేషన్ నిర్వహించి..ఆమె చేతులను మాములు స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఎవరితో మాట్లాడినా..అభ్యంతరం తెలిపేవాడని, అనుమానంతో వేధించసాగాడని బాధితురాలు వెల్లడించింది. తమ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో మహిళ కుటుంబ సభ్యులు ఈ ఘటనపై స్పందించలేదు. ప్రస్తుతం బాధితురాలికి ఆమె మామ సంరక్షకులుగా ఉన్నారు. కోడలిపై ఘాతుకానికి పాల్పడ్డ కుమారుడిని ఇక చేరదీయనని ఆయన పేర్కొన్నారు.