Man Who Slapped Abhishek Banerjee Dies : మమత మేనల్లుడిని చెంపదెబ్బ కొట్టిన వ్యక్తి అనుమానాస్పద మృతి

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని 2015లో ఓ సమావేశంలో చెంపదెబ్బ కొట్టిన దేవాశిష్ ఆచార్య అనే వ్యక్తి తాజాగా అనుమానాస్పద స్థితిలో మరణించాడు.

Man Who Slapped Abhishek Banerjee Dies వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని 2015లో ఓ సమావేశంలో చెంపదెబ్బ కొట్టిన దేవాశిష్ ఆచార్య అనే వ్యక్తి తాజాగా అనుమానాస్పద స్థితిలో మరణించాడు. గురువారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తీవ్ర గాయాలతో ఉన్న దేవాశిష్ ఆచార్యని మిడ్నాపూర్‌లోని తామ్లూక్ జిల్లా హాస్పిటల్ లో వదిలేసివెళ్లిపోయారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో అతడిని తీసుకొచ్చినట్టు హాస్పిటల్ సిబ్బంది పేర్కొన్నారు. అయితే, అదే రోజు మధ్యాహ్నం ఆశీష్ చనిపోయినట్టు తెలిపారు.

అయితే ఇది ముమ్మాటికే హత్యేనని దేవశీష్ కుటుంబం ఆరోపించింది. పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు గతేడాది దేవాశీష్ బీజేపీలో చేరాడని, అందుకే హత్యచేశారని అంటున్నారు. దేవశీష్ తన స్నేహితులతో కలిసి బైక్‌పై జూన్ 16 సాయంత్రం బయటకు వెళ్లాడు.. ఆ ముగ్గురు సోనాపేట్యా టోల్ ప్లాజా దగ్గర టీ స్టాల్ వద్ద ఆగారని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత ఫోన్ రావడంతో దేవాశీష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడని తెలిపారు. ఆ తర్వాత ఏం జరింగిదనే దానిపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

2015లో ఏం జరిగింది

2015లో ఓ సమావేశం సందర్భంగా వేదికపై ఉన్న అభిషేక్ బెనర్జీని చెంపదెబ్బ కొట్టి దేవాశీష్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఆ సమయంలో టీఎంసీ కార్యకర్తలు అతడిని చితకబాది, పోలీసులకు అప్పగించారు. అయితే, అతడి మానసిక పరిస్థితి బాగాలేదని కుటుంబ సభ్యులు చెప్పడంతో అరెస్ట్ చేయొద్దని పోలీసులకు అభిషేక్ సూచించారు. కానీ, అతడిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

టీఎంసీ అప్పుడు ఏం చెప్పింది

తనను చెంపదెబ్బ కొట్టిన దేవాశిష్ ఆచార్యని తాను క్షమించేశానని అప్పట్లో అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యానించినప్పటికీ..దేవాశీష్‌కు సరైన బుద్ధే చెప్పామని టీఎంసీ కార్యకర్తలు కామెంట్ చేశారు. టీఎంసీ నేత, మంత్రి సుబ్రతా ముఖర్జీ..అభిషేక్‌ను చెంపదెబ్బ కొట్టడాన్ని మాజీ ప్రధాని ఇందిర హత్యోందంతో పోల్చారు.‘ఇందిరా గాంధీని చంపిన తర్వాత.. చాలా మంది ప్రజలు చంపబడ్డారు.. కానీ, ఇక్కడ మాత్రం ఆ యువకుడు సజీవంగానే ఉన్నాడని వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు