మణిపూర్ సీఎంకి కరోనా

Manipur CM tests positive for COVID-19 భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సీఎంలు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. తాజాగామణిపూర్ సీఎం ఎన్.బీరేన్ సింగ్ కి కరోనా వైరస్ సోకింది.



తనకు కరోనా సోకినట్లు ఆదివారం(నవంబర్-15,2020)సీఎం స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తనకు కరోనా సోకిందని…ఇటీవల తనతో దగ్గరిగా ఉన్నవాళ్లందరూ సెల్ఫ్ ఐసొలేట్ అవ్వాలని,కరోనా టెస్ట్ చేయించుకోవాలని బీరేన్ సింగ్ తన ట్వీట్ లో తెలిపారు.



కాగా,మణిపూర్ లో గడిచిన 24గంటల్లో 5కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో మణిపూర్ లో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 218కి చేరింది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21వేల636కి చేరింది. ఇప్పటివరకు 18వేల 334మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 84.73శాతంగా ఉంది. ప్రస్తుతం 3వేల 84 యాక్టివ్ కరోనా కేసులు మణిపూర్ లో ఉన్నాయి.



అయితే, ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల సీఎంలు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. కర్ణాటక,మధ్యప్రదేశ్,హిమాచల్ ప్రదేశ్,అరుణాచల్ ప్రదేశ్,హర్యానా,గోవా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనాబారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు