Biren Singh : మణిపూర్ హింసాకాండలో ఇళ్లు కాలిపోయిన నిర్వాసితుల కోసం.. శాశ్వత గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించిన సీఎం బీరెన్ సింగ్

ఈ పథకం కింద ఇంఫాల్ తూర్పు, కక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల నుండి ఎంపిక చేసిన కొంతమంది లబ్ధిదారులకు బీరెన్ సింగ్ శాశ్వత గృహాల నిర్మాణానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

Manipur CM Biren Singh

Manipur CM Nongthombam Biren Singh : మణిపూర్ సీఎం నోంగ్‌తోంబమ్ బీరెన్ సింగ్ శాశ్వత గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించారు. ఇటీవలి హింసాకాండలో ఇళ్లు కాలిపోయి, దెబ్బతిన్న నిర్వాసితుల కోసం గురువారం సీఎం బీరెన్ సింగ్ సెక్రటేరియట్‌లో జరిగిన కార్యక్రమంలో శాశ్వత గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఇంఫాల్ తూర్పు, కక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల నుండి ఎంపిక చేసిన కొంతమంది లబ్ధిదారులకు బీరెన్ సింగ్ శాశ్వత గృహాల నిర్మాణానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా బీరెన్ సింగ్ మాట్లాడుతూ ఈ ఏడాది మే 3 నుంచి చెలరేగిన హింసాకాండలో బాధిత వ్యక్తులు, కుటుంబాలకు వివిధ రకాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో ప్రభుత్వం రూ.399.82 కోట్లు కేటాయించిందన్నారు. ఈ మొత్తంలో మణిపూర్ ఐటీ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు రూ.11 కోట్లు, వివిధ సహాయ శిబిరాలకు టెలివిజన్‌ సెట్‌లు అందించేందుకు రూ.4.5 కోట్లు, ముందుగా నిర్మించిన ఇళ్ల నిర్మాణానికి రూ.150 కోట్లు, రూ.101 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు.

Elon Musk-Piyush Goyal : మంత్రి పీయుష్ గోయల్‌తో ఎలన్ మస్క్ భేటీపై ఉత్కంఠ .. భారత్‌లోకి టెస్లా ఎంట్రీ షురూ..?

ఆరు నెలల పాటు రిలీఫ్ క్యాంపు నిర్వహణ, రిలీఫ్ క్యాంపుల్లో ఉన్న పిల్లలకు అల్పాహారంతోపాటు పౌష్టికాహారం, శీతాకాల సన్నద్ధత అందించడానికి రూ.89.22 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. రెండో దఫాలో రిలీఫ్ క్యాంపుల్లో ఉన్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 1000 చొప్పున ఆర్థిక సహాయం అందించిందని తెలిపారు. రిలీఫ్ క్యాంపుల్లో ఉన్న లేబర్ కార్డ్ హోల్డర్‌లకు కూడా వారి పిల్లల చదువుల కోసం ఒక్కొక్కరికి రూ. 5,000 అందించినట్లు చెప్పారు. శీతాకాలం వచ్చినందున నిర్వాసితులకు పడకలు అందించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందని వెల్లడించారు.

సహాయ శిబిరాల్లో ఉన్న ప్రజలకు రూ. 1000 చొప్పున విడతలో ద్రవ్య సహాయం కోసం రూ. 6 కోట్లు, రూ. 360 కోట్లతో పాటు పలు ఇతర సహాయక చర్యల కోసం రూ. 476 కోట్ల మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు బీరెన్ సింగ్ తెలిపారు. పర్మినెంట్ హౌసింగ్ స్కీమ్ కోసం, రిలీఫ్ క్యాంపు నిర్వహణకు రెండో విడతగా రూ.108 కోట్లు, రిలీఫ్ క్యాంపుల్లో ఉంటున్న బాలికలకు సైకిళ్ల కొనుగోలు కోసం మరో రూ.2.5 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.

Bengaluru : చెత్తకుప్పలో బయటపడ్డ అమెరికా డాలర్ల నోట్ల కట్టలు .. తీసుకెళ్లి యజమానికి అప్పగించిన వ్యక్తి

రాష్ట్ర వ్యాప్తంగా 4800 మందికి పైగా లబ్ధిదారులకు పాడై పోయిన లేదా కాలిపోయిన నిర్వాహితులకు పక్కా ఇళ్ల నిర్మాణానికి రూ.10 లక్షలు, సెమీ పక్కా ఇళ్లకు రూ.7 లక్షలు, కచ్చా ఇళ్లకు రూ.5 లక్షలు అందజేయనున్నారు. రెండు విడతలుగా ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నారు. లబ్ధిదారులు మొదటి విడతలో ఇచ్చిన ఆర్థిక సహాయంతో కొనసాగుతున్న గృహ నిర్మాణ ఫోటోలు సమర్పించి, సంబంధిత డిప్యూటీ కమిషనర్ల ద్వారా రెండవ విడత ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకోవచ్చు.