CBI raided my office again, says Manish Sisodia; probe agency denies claim
Manish Sisodia: తన కార్యాలయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు మరోసారి సోదాలు నిర్వహించారని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తాజాగా ఆరోపించారు. అయితే సిసోడియా చేసిన ఆరోపణలు అవాస్తవమని, తామెలాంటి సోదా చేయలేదని సీబీఐ చెప్పడం గమనార్హం. గతంలో సిసోడియా కార్యాలయంలో సోదాలు జరిగాయి. అయితే అప్పుడు ఏమీ లభించలేదు. ఢిల్లీలోని ఆయన కార్యాలయంతో పాటు ఆయన స్వగ్రామంలో కూడా సోదాలు నిర్వహించారు. ఇక తాజాగా కూడా సోదాలు చేశారని ఆరోపించిన ఆయన, ఎన్నిసార్లు దాడులు చేసినా ఇప్పటి వరకు సీబీఐ ఒక్కటి కూడా కనుక్కోలేకపోయిందని ఎద్దేవా చేశారు.
Nitish as Ram – Modi Ravana: నితీశ్ రాముడు, మోదీ రావణుడు.. ఆర్జేడీ ఆఫీసులు ముందు వెలసిన ఫ్లెక్సీ
ట్విట్టర్ ద్వారా శనివారం ఆయన స్పందిస్తూ ‘‘సీబీఐ ఈరోజు నా కార్యాలయంలోకి మళ్లీ వచ్చింది. వారికి నా స్వాగతం. నా ఇంటి మీద రైడ్ చేశారు. ఆఫీసులో రైడ్ చేశారు. నా లాకర్ తెరిచి చూశారు. నా గ్రామానికి వెళ్లి అక్కడ కూడా రైడ్ చేశారు. కానీ వారు ఇప్పటికీ కనుక్కున్నది ఏమీ లేదు. నేను ఢిల్లీలో విద్యార్థుల విద్య కోసం నిజాయితీగా పని చేస్తున్నాను. అవినీతికి పాల్పడే వారి కార్యాలయాల్లో చేయాల్సిన సోదాలు, అనవసరంగా నా కార్యాలయంలో చేస్తున్నారు’’ అని ట్వీట్ చేశారు.
ఇక సిసోడియా చేసిన ఆరోపణలు సీబీఐ కొట్టి పారేసింది. ఆయన చెప్పేవన్నీ అవాస్తవాలనీ, తామెలాంటి రైడ్ చేయలేదని పేర్కొంది. ఈ విషయమై సీబీఐ స్పందిస్తూ ‘‘మనీశ్ సిసోడియాకు సంబంధించిన ఏ కార్యాలయంలోనూ, ఏ ప్రాంతంలోనూ సీబీఐ సోదాలు నిర్వహించలేదు. ఆయనకు సెక్షన్ 91 ప్రకారం డాక్యూమెంట్ పంపాలని నోటీసులు మాత్రం జారీ చేశాం. ఇది కేవలం డాక్యూమెంట్ సమర్పించడానికి పంపింది మాత్రమే. అయితే మనీశ్ కార్యాలయానికి సీబీఐ అధికారులు వెళ్లిన మాట వాస్తవమే. కానీ, డాక్యూమెంట్లు తీసుకోవడానికి మాత్రమే వెళ్లింది’’ అని పేర్కొన్నారు.