Nitish as Ram – Modi Ravana: నితీశ్ రాముడు, మోదీ రావణుడు.. ఆర్జేడీ ఆఫీసు ముందు వెలసిన ఫ్లెక్సీ

నితీశ్ రాముడు అయితే మోదీ రావణుడు, నితీశ్ కృష్ణుడు అయితే మోదీ కంసుడు అనే అర్థంలో ఫ్లెక్సీని రూపొందించారు. రామాయణంలో ఇలా జరిగింది, మహాభారతంలో ఇలా జరిగింది. అని మొదటి రెండు ఫొటోలకు ముందు రాశారు. ఇక మూడవ ఫొటోలో ఆ రెండు ఇతిహాసాల్లో జరిగినట్లు 2024లో జరుగుతుందని, మోదీని నితీశ్ ఓడిస్తారన్నట్లుగా రాసుకొచ్చారు

Nitish as Ram – Modi Ravana: నితీశ్ రాముడు, మోదీ రావణుడు.. ఆర్జేడీ ఆఫీసు ముందు వెలసిన ఫ్లెక్సీ

Nitish Kumar as Ram, PM Modi Ravana: Posters outside Patna RJD office

Nitish as Ram – Modi Ravana: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‭ను రాముడిగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీని రావణుడిగా చూపిస్తున్న ఫ్లెక్సీ ఒకటి రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) కార్యాయం ముందు వెలసింది. రామాయణం, మహాభారతాలను చూపిస్తూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో నితీశ్ నేతృత్వంలోని మహాఘట్‭బంధన్ (మహాకూటమి) విజయం సాధిస్తుందనే అర్థంలో ఈ ఫ్లెక్సీని రూపొందించారు. ఫ్లెక్సీలో నితీశ్‭ను రాముడు, కృష్ణుడితో పోల్చారు. అంతే కాకుండా దేశంలోని విపక్ష నేతలందరూ ఆయన వెన్నంటి ఉన్నట్లు రూపొందించారు. ఇక భారతీయ జనతా పార్టీ తరపున నరేంద్రమోదీ, అమిత్ షా, జేపీ నడ్డాల ఫొటోను పెట్టారు.

Raju Yadav Teaser : ఖర్మకాలి జీవితాంతం నవ్వుతూనే ఉండాల్సి వస్తే.. గెటప్ శ్రీను హీరోగా రాజు యాదవ్ టీజర్ రిలీజ్..

మూడు వరుసల ఫొటోలు పెట్టారు. మొదటి దాంట్లో రామాయణానికి సంబంధించింది పెట్టారు. అందులో ఒకవైపు రాముడు విల్లు ఎక్కుపెట్టి ఉండగా, మరొక వైపు పది తలల రావణుడి చాతిలో బాణం గుచ్చినట్లు ఉంది. ఇక రెండవ దాంట్లో మహాభారతానికి సంబంధించిన ఫొటో ముద్రించారు. ఇందులో పాండవులు, కౌరవులను సూచిస్తూ పాండవులవైపు కృష్ణుడు, కౌరవుల వైపు కంసుడు ఉన్నట్లు చూపించారు. ఈ రెండింటితో పోలుస్తూ మూడవ ఫొటో ముద్రించారు. ఇందులో నితీశ్ కుమార్, రాహుల్ గాంధీ సహా దేశంలోని విపక్ష నేతల్ని ఒకవైపు ముద్రించగా, మరొకవైపు మోదీ, అమిత్ షా, నడ్డా ఫొటోలను ముద్రించారు. ఇందులో నితీశ్ కుమార్, నరేంద్రమోదీ పేర్లను రాసుకొచ్చారు.

Philippines Floods: ఫిలిప్పీన్స్‌ను ముంచెత్తిన వరదలు.. 20మంది మృతి.. నిరాశ్రయులైన 70వేల మంది

అంటే, నితీశ్ రాముడు అయితే మోదీ రావణుడు, నితీశ్ కృష్ణుడు అయితే మోదీ కంసుడు అనే అర్థంలో ఫ్లెక్సీని రూపొందించారు. రామాయణంలో ఇలా జరిగింది, మహాభారతంలో ఇలా జరిగింది. అని మొదటి రెండు ఫొటోలకు ముందు రాశారు. ఇక మూడవ ఫొటోలో ఆ రెండు ఇతిహాసాల్లో జరిగినట్లు 2024లో జరుగుతుందని, మోదీని నితీశ్ ఓడిస్తారన్నట్లుగా రాసుకొచ్చారు. ఫ్లెక్సీలో మహాఘట్‭బంధన్ విజయం సాధిస్తుందని, మహాఘట్‭బంధన్ జిందాబాద్ అంటూ నినాదాలు రాశారు.

Fire Boltt Supernova Smartwatch : ఫైర్ బోల్ట్ సూపర్‌నోవా స్మార్ట్‌వాచ్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ఇండియాలో ధర ఎంతంటే?

ఆర్జేడీ జిల్లా కార్యదర్శి పూనమ్ రాయి ఫొటోతో ఈ ఫ్లెక్సీ వెలిసింది. అయితే ఇలాంటి పోస్టర్ల గురించి తమకు తెలియదని ఆర్జేడీ చెప్పుకొచ్చింది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మృత్యంజయ్ తివారీ స్పందిస్తూ ‘‘మా పార్టీ అధికారికంగా ఏర్పాటు చేసినవి అయితే కాదు. 2024 సార్వత్రిక ఎన్నికలకు బిహార్ నుంచే బీజేపీ సిద్ధమవుతోంది. యువత, రైతులు, పేదలతో బీజేపీ పోరాటం చేయనుంది. ఇక ఇదే బిహార్ నుంచి బీజేపీ ప్రత్యామ్నాయం సృష్టించబోతున్నారు నితీశ్ కుమార్’’ అని అన్నారు.