Raju Yadav Teaser : ఖర్మకాలి జీవితాంతం నవ్వుతూనే ఉండాల్సి వస్తే.. గెటప్ శ్రీను హీరోగా రాజు యాదవ్ టీజర్ రిలీజ్..

 బుల్లితెరపై జబర్దస్త్ షోతో బాగా పాపులారిటీ తెచ్చుకున్న కమెడియన్ గెటప్ శ్రీను. టీవీ షోలతో ఫేమస్ అయి సినిమాల్లోకి కూడా ప్రవేశించాడు. ప్రస్తుతం పలు సినిమాల్లో కమెడియన్ గా చేస్తూ బిజీగా ఉన్నాడు గెటప్ శ్రీను. ఓ పక్క టీవీ షోలు, సినిమాలతో బిజీగా అంటూనే తాజాగా హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. గెటప్ శ్రీను హీరోగా రాజు యాదవ్...........

Raju Yadav Teaser : ఖర్మకాలి జీవితాంతం నవ్వుతూనే ఉండాల్సి వస్తే.. గెటప్ శ్రీను హీరోగా రాజు యాదవ్ టీజర్ రిలీజ్..

Getup Srinu Raju Yadav Movie Teaser Released

Raju Yadav Teaser :  బుల్లితెరపై జబర్దస్త్ షోతో బాగా పాపులారిటీ తెచ్చుకున్న కమెడియన్ గెటప్ శ్రీను. టీవీ షోలతో ఫేమస్ అయి సినిమాల్లోకి కూడా ప్రవేశించాడు. ప్రస్తుతం పలు సినిమాల్లో కమెడియన్ గా చేస్తూ బిజీగా ఉన్నాడు గెటప్ శ్రీను. ఓ పక్క టీవీ షోలు, సినిమాలతో బిజీగా అంటూనే తాజాగా హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. గెటప్ శ్రీను హీరోగా రాజు యాదవ్ అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో అంకిత ఖారత్ హీరోయిన్ గా నటిస్తుంది. కొత్త దర్శకుడు కృష్ణమాచారి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా సంక్రాంతి కానుకగా రాజు యాదవ్ టీజర్ ని రిలీజ్ చేశారు.

టీజర్ కి బ్రహ్మానందం వాయిస్ ఓవర్ ఇచ్చారు. జీవితంలో నవ్వితే సంతోషంగా ఉంటాము కానీ ఖర్మకాలి ఎప్పటికి నవ్వు ఫేస్ తోనే ఉండాల్సి వస్తే ఏం జరుగుతుందో అని టీజర్ ని ఓపెన్ చేశారు. ఖాళీగా ఉండే గెటప్ శ్రీను క్రికెట్ ఆడుతుంటే అనుకోకుండా బాల్ వచ్చి నోటికి తగులుతుంది. దీంతో ఎప్పటికి నవ్వుతూనే ఉండాల్సి వస్తుంది. దాస్ స్మైల్ ఫేస్ తో అలా ఉండిపోతుంది. ఎవరన్నా చనిపోయినా, ఎవరన్నా కొట్టినా, ఏం జరిగినా నవ్వు ఫేస్ ఉండటంతో అతనికి కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఈ సమయంలో అతనికి హీరోయిన్ పరిచయం అవుతుంది. హీరోయిన్ తో ప్రేమ ఎలా పుట్టింది? హీరోయిన్ , హీరో మధ్య ఎలాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయి అని టీజర్ ని ముగించారు. చివర్లో హీరోయిన్ వచ్చి గెటప్ శ్రీనుకి లిప్ కిస్ ఇచ్చే షాట్ తో కట్ చేశారు.

GopiChand30 : బాలయ్య చెప్పిన టైటిల్‌నే ఖాయం చేసుకున్న గోపీచంద్..

నటన పరంగా ఇప్పటికే గెటప్ శ్రీను బుల్లితెరపై డిఫరెంట్ గెటప్ వేసి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమాలో కూడా అతన నటనతో మెప్పించనున్నాడు. టీజర్ లోనే మంచి పర్ఫార్మెన్స్ కనపడే సీన్స్ వేశారు. ఈ సినిమాని 2023 సమ్మర్ లో విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. ఇన్నాళ్లు కమెడియన్ గా నవ్వించిన గెటప్ శ్రీను ఇప్పుడు హీరోగా ఎలాంటి ఫలితం చూస్తాడో చూడాలి మరి.