Manmohan Singh funeral
Manmohan Singh Funeral: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర భారీ జనసంద్రోహం మధ్య సాగింది. కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. శనివారం ఉదయం నివాసం నుంచి మన్మోహన్ సింగ్ పార్ధివ దేహాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు. పార్దివదేహం వద్ద మన్మోహన్ సింగ్ సతీమణి గురుశరణ్ సింగ్, ఆయన కుమార్తె, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ నేతలు అంజలి ఘటించారు. అనంతరం అక్కడి నుంచి అంతిమయాత్రగా నిగమ్‌బోధ్ ఘాట్‌కు వద్దకు మన్మోహన్ సింగ్ పార్ధివ దేహం చేరుకుంది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.