భయంకరమైన వార్త : కోబ్ బ్రియాంట్ మృతిపై పలువురు సంతాపం

  • Publish Date - January 27, 2020 / 04:18 AM IST

కాలిఫోర్నియాలోని హెలికాప్టర్ ప్రమాదంలో బాస్కెట్ బాల్ దిగ్గజం కోబ్ బ్రయంట్‌తో పాటు మరికొంతమంది మరణించారని తెలిసింది..ఇది ఎంతో భయంకరమైన వార్త అంటూ అమెరికాలో అధ్యక్షులు ట్రంప్, మాజీ అధ్యక్షులు ఒబామా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఓ లెజెండ్, ఆయన కుమార్తె గియానా కూడా ప్రమాదంలో చనిపోవడం ఎతో బాధాకరమన్నారు. అమెరికా ఓ దిగ్గజ ఆటగాడిని కోల్పోయిందని, దేశంలో బాస్కెట్ బాల్ అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు.

* కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్‌లో హెలికాప్టర్ కూలిన ఘటనలో కోబ్ బ్రయంట్, ఆయన కుమార్తె జియానా (13)తో సహా 9 మంది చనిపోయారు. 
* సికోర్సికీ ఎస్ 76 హెలికాప్టర్‌లో వీరు ప్రయాణం చేస్తున్నారు. 
* లాస్ ఏంజెల్స్‌లోని పశ్చిమాన ఉన్న ఓ కొండను ప్రమాదవశాత్తు ఢీకొంది. 

అమెరికన్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ సంతాపం తెలియచేసింది. అతడి మరణం ఎన్‌బీఏకు తీరనిలోటుగా అభివర్ణించింది. లేకర్ నేషన్, బాస్కెట్ బాల్ క్రీడ, నగరం కోబ్ లేకుండా ఎప్పటికీ ఒకేలా ఉండదని లాస్ ఏంజిల్స్ మాజీ లేకర్స్ స్టార్ మ్యాజిక్ జాన్సన్ సంతాపం తెలియచేశారు. బ్రియాంట్, అతడి కుమార్తె మరణవార్త విని షాక్‌కు గురయ్యాను..ప్రపంస్థాయి ఆటగాడికి నా కన్నీటి వీడ్కోలు అంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 

* ప్రయాణీకులను కాపాడటానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. 
* కానీ అప్పటికే వారు మంటల్లో కాలిపోయారు. 
* బాస్కెట్ బాల్ చరిత్రలో బ్రయంట్ ఎన్నో రికార్డులు సృష్టించాడు. 
 

* ఐదుసార్లు NBA ఛాంపియన్‌గా నిలిచాడు. 
* రెండుసార్లు ఒలింపిక్ స్వర్ణాలను కైవసం చేసుకున్నాడు. 
* ఈ అమెరికా ప్లేయర్ 2016 రిటైర్ మెంట్ ప్రకటించాడు. 

Read More : క్రీడా జగత్తులో విషాదం : కోబ్ బ్రయంట్ జీవిత విశేషాలు