మోడీ బర్త్‌డే :మొక్కుగా 1.25 Kg బంగారు కిరీటం

  • Publish Date - September 17, 2019 / 06:14 AM IST

ప్రధాని నరేంద్ర మోదీకి దేశవిదేశాల్లో ఎంతోమంది అభిమానులున్నారు. అభిమానులు అనే కంటే వీరాభిమానులు అనటం కరెక్ట్. సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్రమోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు,అభిమానులు పలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ  క్రమంలో మోడీ జన్మదినం సందర్భంగా ఆయన వీరాభిమాని వారణాశిలోని సంకత్ మోచన్ హనుమాన్ కి బంగారు కిరీటాన్ని సమర్పించాడు. 

ప్రధానిగా మోడీ రెండవసారి అధికారంలోకి వస్తే..హనుమంతుడికి బంగారు కిరీటాన్ని చేయిస్తానని అర్వింద్ సింగ్ అనే వ్యక్తి మొక్కుకున్నాడు. ఆయన కోరిన నెరవేరింది. భారత ప్రజలు మోడీకి రెండవసారి అత్యధిక మెజారిటీతో పట్టం కట్టారు. దీంతో మోడీ నియోజకవర్గం అయిన వారణాశికి చెందిన అర్వింద్ సింగ్ మోడీ పుట్టిన రోజు సందర్భంగా తన మొక్కును తీర్చుకున్నాడు. 1.25 కేజీల బంగారంతో చేసిన కిరీటాన్ని హనుమంతుడికి సమర్పించుకున్నాడు. 

ఈ సందర్భంగా అర్వింద్ సింగ్ మాట్లాడుతూ..గత 75 ఏళ్లలో జరగని అభివృద్ధి మోడీ ప్రధాని అయ్యాక ఆయన హయాంలో జరిగిందనీ అందుకే తనకు మోడీ అంటే అంత అభిమానానమనీ తెలిపాడు. భారతదేశానికి మంచి రోజులు వచ్చాయి కాబట్టి మోడీ మరోసారి ప్రధాని అయ్యారని..భారత్ ను బంగారంలో వెలిగిపోయేలా మోడీ అభివృద్ధి చేస్తున్నారనీ అందుకే బంగారు కిరీటాన్ని హనుమంతుడికి సమర్పించానని తెలిపాడు.

కాగా..వారణాలు ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు బీజేపీ కార్యకర్తలు అభిమానులు. దీపాలు వెలిగించి పేదలకు స్వీట్లు, పండ్లను పంపిణీ చేస్తున్నారు. మోడీ అహ్మదాబాద్‌లో రోజు జరుపుకుంటున్నారు.బీజేపీ  ‘సేవా సప్తా’ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న క్రమంలో  పలు సామాజిక కార్యక్రమాలను చేపట్టింది.