Inter Religion Marriage: ముస్లిం.. ముస్లిమేతరుల మధ్య పెళ్లి చట్టబద్ధం కాదు – ఆల్ ఇండియా ముస్లిం బోర్డ్

ముస్లింతో మరో ముస్లిమేతర యువతికి వివాహం చేసినా అది దురదృష్టవశాత్తు చట్టబద్ధం కాదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ చెప్తుంది. ఈ మేరకు ఏడు పాయింట్ల సూచనలిస్తూ కామెంట్ చేసింది. మొబైల్ ఫోన్స్ పిల్లలకు ఇస్తూ వారిపై ఓ కన్నేయాలని చెప్పింది.

Inter Religion Marriage: ముస్లింతో మరో ముస్లిమేతర యువతికి వివాహం చేసినా అది దురదృష్టవశాత్తు చట్టబద్ధం కాదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ చెప్తుంది. ఈ మేరకు ఏడు పాయింట్ల సూచనలిస్తూ కామెంట్ చేసింది. మొబైల్ ఫోన్స్ పిల్లలకు ఇస్తూ వారిపై ఓ కన్నేయాలని చెప్పింది. అంతేకాకుండా పిల్లలను కో ఎడ్యుకేషన్ స్కూళ్లలో వేయకూడదని చెప్పింది.

అటువంటి పెళ్లిళ్లు షరియా చట్ట ప్రకారం నిషేదించారని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ జనరల్ సెక్రటరీ మౌలానా ఖలీద్ సైఫుల్లా రహ్మానీ స్టేట్మెంట్ ఇచ్చారు. పేరెంట్స్, సంరక్షకులు, మసీదుకు ప్రతినిధులుగా ఉండేవారు, మదరసాలకు వెళ్లేవారు మతాంతర వివాహాలు అడ్డుకునేందుకు ముందడుగేయాలని చెప్పారు. ఇస్లాంలో బహుదైవతారాధన ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదని గుర్తు చేశారు.

సామాజిక పరిస్థితుల దృష్ట్యా.. వ్యాలిడ్ అయినా షరియా చట్ట ప్రకారం.. లీగల్ కాదు. పేరెంట్స్ లో మతపరమైన విద్య కరువవడం వల్ల, సహద్యోగుల కల్చర్ పెరిగి.. మతాంతర వివాహాలు జరుగుతూ ఉన్నాయి.

ఇండియాలో వ్యతిరేక లవ్ జిహాద్:
పిల్లల పెళ్లిళ్లకు పేరెంట్స్ లేట్ చేయకూడదు. ప్రత్యేకించి పెళ్లి ఆలస్యం కావడం పెద్ద సమస్య తీసుకొస్తుంది. ఇమామ్స్, మసీదులు అటువంటి వాటిపై చర్చించి అసౌకర్యాలను తెలియజేయాలని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు