Toxic Work Environment (Image Credit To Original Source)
Toxic Work Environment: నిశ్చితార్థం కోసం ఓ యువకుడు ఆఫీసులో సెలవు అడిగాడు. అయితే, పెళ్లి ఎమర్జెన్సీ కాదని నిశ్చితార్థానికి ముందు కూడా పనిచేయాలని అతడి బాస్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ వరుడు రెడ్డిట్‌లో పోస్ట్ చేశాడు. ఆఫీసులో ప్రాజెక్ట్ టీమ్ తన వివాహం గురించి పట్టించుకోలేదని పేర్కొన్నాడు.
“నా నిశ్చితార్థం, వివాహం విషయాన్ని 2 నెలల క్రితమే చెప్పాను. అందుకు తగ్గట్లు వర్క్ ప్లాన్ వేయకుండా విస్మరించారు. ఇప్పుడు వీకెండ్ అంతా పని చేయాలని అంటున్నారు. మా సీనియర్ మేనేజర్ నిజంగానే వివాహమేమీ ఎమర్జెన్సీ కాదని అన్నాడు. నా ఆర్‌ఎం నా పని గురించి ఏ మాత్రం తెలియని వ్యక్తి, అందుబాటులో కూడా ఉండడు” అని పోస్టు చేశాడు.
Also Read: 40 గంటల్లో 145 మంది మిలిటెంట్లను చంపేసిన పాకిస్థాన్ సైన్యం
రోజంతా జూమ్ కాల్స్, గంటగంటకూ అప్డేట్లు వస్తుంటాయని అన్నాడు. “ఇటీవల జియో ఫెన్సింగ్ కూడా అమలు చేశారు. బేస్ లొకేషన్ నుంచి 120 కిలోమీటర్లకు మించి పని చేయలేరు. నా లీడ్స్? సైట్‌లోనూ, ఆఫ్‌సైట్‌లోనూ పనికిరాని వాళ్లు. మేనేజ్‌మెంట్ బూట్లు నాకడమే వారి పని.
ఇదంతా సరిపోనట్టు, మార్చిలో ఈ ప్రాజెక్ట్ నుంచి నన్ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పుడు వివాహాన్ని వాయిదా వేయలేను. ఈ గందరగోళాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు నిజంగా తెలియదు” అని తెలిపాడు. ఈ పోస్టు బాగా వైరల్ అవుతోంది. తమకు ఎదురైన ఇటువంటి అనుభవాల గురించి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Management wants me at work right before my engagement
byu/Mother-Ad3590 indevelopersIndia