Mask Vending Machine: ప్రయాణికుల కోసం వెండింగ్ మిషన్.. రూ.5 నాణం వేయండి.. మాస్క్ పొందండి..

కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా ప్రతిఒక్కరూ బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం తప్పనిసరిగా మారింది. మాస్క్ తో పాటు సామాజిక దూరాన్ని పాటించాల్సిన అవసరం తప్పక ఉంది.

Mask Vending Machine

Mask Vending Machine: కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా ప్రతిఒక్కరూ బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం తప్పనిసరిగా మారింది. మాస్క్ తో పాటు సామాజిక దూరాన్ని పాటించాల్సిన అవసరం తప్పక ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయడం రిస్క్ తో పని.. ప్రయాణ సమయాల్లో మాస్క్ లేకుంటే ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకే ప్రమాదం పొంచి ఉంది.. అందుకే ప్రయాణాల్లో మాస్క్ తప్పక ఉండేలా చర్యలు చేపడుతున్నారు.

చెన్నైలోని కోయంబేడు బస్టాండులో ప్రయాణికుల కోసం మాస్క్ వెండింగ్ మిషన్ ఏర్పాటు చేశారు. ప్రయాణికులు మాస్క్ ధరించని పక్షంలో ఈ వెండింగ్ మిషన్ ద్వారా మాస్క్ పొందవచ్చు.. మాస్క్ పొందాలంటే.. ఈ వెండింగ్ మిషన్ లో రూ.5 నాణం వేయాల్సి ఉంటుంది.


నాణం వేయగానే మిషన్ నుంచి ఒక డిస్పోజిబుల్ మాస్క్ బయటకు వస్తుంది. ప్రయాణానికి ముందుగా బస్టాండులోనే మాస్క్ లు పొందవచ్చు. మాస్క్ ధరించి ప్రయాణం చేయడం ద్వారా వారికి మాత్రమే కాదు.. తోటి ప్రయాణికులకు కూడా వైరస్ సోకకుండా నిరోధించవచ్చు.