లాక్‌డౌన్‌లో ఏం చేయాలి? ఆత్మకథను రాయండి..మాస్క్‌లు లేవా? టవల్ వాడండి. త్రిపుర సీఎం చెప్పే ఇంకొన్ని చిట్కాలు…!

  • Publish Date - March 28, 2020 / 07:39 AM IST

దేశ వ్యాప్తంగా కరోనా డేంజర్ బెల్స్ మ్రోగుతున్నాయి. ఈ వైరస్ నుంచి బయటపడేందుకు మార్గాలు వెతుకుతున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. బయటకు వెళ్లే వారు ముఖానికి మాస్క్ లు ధరించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ కొన్ని రాష్ట్రాల్లో మాస్క్ ల కొరత ఏర్పడుతోంది. మరికొన్ని ఏరియాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

అయితే..లాక్ డౌన్, మాస్క్ ల కొరతపై త్రిపురా సీఎం బిప్లాబ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మాస్క్ లు పంపిణీ చేయడం సాధ్యం కాదని, ఆసుపత్రుల్లో పనిచేసే వారికి మాత్రమే ఇవి సరిపడా ఉన్నాయన్నారు. కరోనాను అరికట్టేందుకు మాస్క్ లతో పని లేదనే అభిప్రాం వ్యక్తం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా అందరూ తడిచిన టవల్ (‘Jal Gamchha’) ఉపయోగించాలని సూచించడం విశేషం. 

లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఈ విధంగా చేస్తే రోజులు ఇట్టే గడచిపోతాయంటున్నారు. ఖాళీగా ఉండకుండా..ప్రజలు తమ ఆత్మకథను రాయాలని సూచించారు. ఈ 21 రోజుల్లో మీరు మంచి రచయితగా మారిపోవచ్చని తెలిపారు. 21 రోజులు 21 సెకన్లుగా గడిచిపోతాయన్నారు. ఈ సీఎం కాకుండా..ఆరోగ్య శాఖ మంత్రి కావడం విశేషం. 

కరోనా వైరస్ ఇప్పటికే భారతదేశాన్ని గడగడలాడిస్తోంది. కేరళలో 2020, మార్చి 28వ తేదీ తొలి మరణం సంభవించింది. దాదాపు 800కి పైగానే బాధితులు చికిత్స పొందుతున్నారు. దాదాపు 20 మంది చనిపోయారు. త్రిపురలో 948 మంది క్వారంటైన్ లో చికిత్స అందిస్తున్నారు. ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదని తెలుస్తోంది.