Vaishno Devi Shrine : జమ్మూ కాశ్మీర్‌లో భారీ అగ్ని ప్రమాదం

జమ్మూ కశ్మీర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కత్రలోని వైష్ణో దేవి మందిరం సమీపంలో షాట్ సర్య్కూట్ కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాలికా భవన్‌లోని క్యాష్ కౌంటింగ్ రూమ్‌లో సాయంత్రం 4.15 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Vaishno Devi Shrine

Vaishno Devi shrine complex in J&K : జమ్మూ కశ్మీర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కత్రలోని వైష్ణో దేవి మందిరం సమీపంలో షాట్ సర్య్కూట్ కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాలికా భవన్‌లోని క్యాష్ కౌంటింగ్ రూమ్‌లో సాయంత్రం 4.15 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను 45 నిమిషాల తర్వాత అదుపులోకి తెచ్చారు. ఇప్పటివరూ ఈ ప్రమాదంలో ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. కానీ, కాలికా భవన్ మాత్రం మంటల్లో బాగా ధ్వంసమైనట్టు కనిపిస్తోంది.


ప్రమాదంలో డాక్యుమెంట్లు, కొంత నగదు కూడా కాలిబూడిదైనట్టు అధికారులు చెబుతున్నారు. షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు సాయంత్రం 4.30 గంటలకు తమకు సమాచారం వచ్చిందని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించినట్టు తెలిపారు. కొంతమంది స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.