Fire In Hospital : తమిళనాడులోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం

అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Fire In Private Hospital (Photo Credit : Google)

Fire In Hospital : తమిళనాడులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. 20మందికి గాయాలయ్యాయి. వారిని మరో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురు రోగులు, సిబ్బంది మంటల్లో చిక్కుకున్నారు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దిండిగల్-తిరుచ్చి హైవేపై ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగింది. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

అగ్నిప్రమాదం జరిగిన ఆసుపత్రి ప్రముఖ ఆర్థోపెడిక్ హాస్పిటల్. దిండిగల్ లో ప్రముఖ ఆసుపత్రిగా గుర్తింపు ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ లోని రిస్పెషన్ ఏరియాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని చెబుతున్నారు. చూస్తుండగానే, క్షణాల్లో మంటలు భవనంలోని ఇతర ఫ్లోర్స్ కు పాకిపోయాయని పోలీసులు తెలిపారు. మంటలు చెలరేగడంతో అక్కడ భారీగా పొగ అలుముకుంది. దీంతో శ్వాస పీల్చుకోలేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

అగ్నిప్రమాదం విషయం తెలిసిన వెంటనే అధికార యంత్రాంగం స్పందించింది. 50 అంబులెన్స్ లను రంగంలోకి దింపింది. అగ్నిప్రమాదం జరిగిన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆ వాహనాలు వినియోగిస్తున్నారు.