×
Ad

Rajasthan : ఇండస్ట్రీయల్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది సజీవ దహనం

Rajasthan : రాజస్థాన్ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఎనిమిది మంది సజీవదహనం అయ్యారు.

chemical factory

  • రాజస్థాన్‌లోని ఖేర్తల్-తిజారా జిల్లాలో పెను విషాదం
  • కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
  • ఎనిమిది మంది సజీవదహనం

Rajasthan : రాజస్థాన్ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఖైర్తల్ – తిజారా జిల్లా భివాడిలోని ఖుష్ఖేరా కరౌలి ఇండస్ట్రీయల్ ఏరియాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు.

Also Read : RBI New Rules : ఇక లోన్ ఏజెంట్ల బెదిరింపులకు చెక్.. బ్యాంకు లోన్లు తీసుకున్నవారికి RBI అండగా, కొత్త నిబంధనలివే!

అగ్నిప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. సుమారు గంటన్నర పాటు అగ్నిమాపక సిబ్బంది నిరంతరాయంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం సమయంలో ఫ్యాక్టీరీలో తొమ్మిది మంది చిక్కకున్నట్లు, వారిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మరో కార్మికుడి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది.

ఫ్యాక్టరీలో రసాయనాల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని, దీని వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. భివాడీ ఎస్పీ, ఏడీఎం సహా ఇతర ఉన్నతాధికారులు సంఘటనా స్థలంకు చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని ఎస్పీ తెలిపారు. మరోవైపు ప్రమాద స్థలివద్దకు చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.