Matrimony
Matrimony ad: ఓ మ్యాట్రిమోనల్ యాడ్ చర్చనీయాంశంగా మారింది. తమకెలాంటి వధువు కావాలో గుణాలు చెప్పడం వరకూ ఓకే కానీ, శరీర కొలతలు వర్ణించి ఇంతే పరిమాణంలో ఉండాలని చెప్తున్న పోస్టుపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. Betterhalf.ai అనే మ్యాట్రిమోనీ సైట్ కు చెందిన వ్యక్తి రిక్వైర్మెంట్స్ స్క్రీన్ షాట్ తీసి అలా పోస్టు చేశారు.
ఒక వ్యక్తి తనకు కావాల్సినవన్నీ బయోలో ఉంచి పెళ్లికూతుర్ని అడగడం, ఈ రకంగా అడగటాన్ని మహిళను అవమానించినట్లేనని అంటున్నారు. అందులో మహిళ బ్రెస్ట్ కొలత, నడుము కొలత, పాదం ఎంత పొడుగుండాలి అని రాసుకొచ్చాడు. 80శాతం క్యాజువల్ డ్రెస్ లలో, 20శాతం ఫార్మల్ డ్రెస్ లలో కనిపించాలని, అంతేకాకుండా బెడ్ మీద కూడా బట్టలు వేసుకోవాలని చెప్తున్నాడు.
ఈ పోస్టు చూసిన వాళ్లు విసిగిపోకుండా ఉండరు. వెంటనే కామెంట్స్ సెక్షన్ లో తిట్టకుండానూ ఉండరు. ఈ పోస్టు పెట్టిన వ్యక్తి నిజంగానే పోస్టు చేశాడా లేదంటే సరదా కోసం క్రియేట్ చేశాడా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
………………………………………. : సామాన్యుడికి షాక్..కిలో టమాటా ధర.130