Tomato Price : సామాన్యుడికి షాక్..కిలో టమాటా ధర.130

ఏపీలో కురుస్తున్న వర్షాలకు, వరదలకు టమాటా ధరలకు రెక్కలు వచ్చాయి. వర్షాలు, వరదలతో పంటలు నీట మునగడంతో పాటు.. దిగుబడి గణనీయంగా పడిపోవడంతో మార్కెట్‌లో టమాటా ధరలు తాకుతున్నాయి.

Tomato Price : సామాన్యుడికి షాక్..కిలో టమాటా ధర.130

Tamoto

Updated On : November 24, 2021 / 5:10 PM IST

Madanapalle Agricultural Market : టమాటా సామాన్యుడి కంట కన్నీరు తెప్పిస్తోంది. టమాటా కొనలేక..కొన్నా సరిగ్గా తీనలేక సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. టమాటా ధరలు ఆల్‌టైమ్‌ హైకి చేరుకున్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా కిలో టమాటా ఏకంగా 130 రూపాయలు పలికింది. గత నెలలో గరిష్టంగా కిలో 50 రూపాయలు పలికిన టమాటా ధర ఇప్పుడు ఏకంగా 130 రూపాయలకు చేరి ఇంకా ఆకాశంవైపే చూస్తోంది.

ఏపీలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు, వరదలకు టమాటా ధరలకు రెక్కలు వచ్చాయి. వర్షాలు, వరదలతో పంటలు నీట మునగడంతో పాటు.. దిగుబడి గణనీయంగా పడిపోవడంతో మార్కెట్‌లో టమాటా ధరలు చుక్కలను తాకుతున్నాయి. టమాటాకు భారీ డిమాండ్ ఉండడంతో హోల్‌సేల్‌గానే టమాటా ధర భారీగా పలుకుతోంది.

CM KCR : నాలుగో రోజు ఢిల్లీలో సీఎం కేసీఆర్.. ప్రధాని అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూపులు

తగ్గిన దిగుబడితో పాటు ఇతర రాష్ట్రాల్లో టమాటా సాగు ఆశాజనకంగా లేదు. టమాటా ధర పైపైకి ఎగబాగుతోంది. మరికొన్ని రోజులు ఇదే ధర ఉండే అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్‌లోనూ సేమ్‌ సీన్‌..! హైదరాబాద్‌లో కూడా టమాటా ధర వినియోగదారుడిని బెంబేలెత్తిస్తోంది.. కిలో 100 రూపాయలు దాటటడంతో టమాటా కొనే పరిస్థితి లేకుండాపోయింది.

రెండు తెలుగురాష్ట్రాల్లో టమాటా ధర రూ.100 దాటింది. పేద, మధ్యతరగతి ప్రజలకు టమాటా దూరమవుతోంది. టమాటా కూర, టమాటా పప్పును పేద ప్రజలు వండడం మానేశారు. కూరల్లో టమాటాకు బదులు చింతపండు వాడుతున్నారు. ఏపీలో భారీ వర్షాలు కురవడంతో టమాటా ధరలు పెరిగాయి. టమాటా పంటలు నీట మునిగాయి. టమాటా సాగుపై వరదలు తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో దిగుబడి గణనీయంగా పడిపోయింది.