కోట్లున్నక్రికెటర్ : ఫుట్ పాత్ పై వాచ్ కోసం గీసి గీసి బేరం 

  • Publish Date - April 17, 2019 / 07:50 AM IST

క్రికెట్..దీంట్లో తారాస్థాయికి చేరుకున్న వారికి డబ్బులకు కొదవలేదు..కో..అనకుండానే కోట్లు రాలతాయి. అందులోను స్టార్  క్రికెటర్ కు కోట్లు కూడా ఓ లెక్కలోవి కాదు. కానీ ఇక్కడ ఉన్న ఓ క్రికెటర్ మాత్రం కేవలం రూ.2 వందల వాచ్ కోసం ఎంతగా గీసి గీసి బేరం ఆడటం విశేషంగా మారింది. 

తన కెరీర్‌లో కోట్లు సంపాదించాడు. కానీ చెన్నై వీధుల్లో తిరుగుతూ ఫుట్‌పాత్‌పై అమ్మే ఓ వాచ్ కోసం గీసి గీసి బేరమాడుతూ కనిపించాడు. ఎలాగైనేతే బేరానికి క్లాలిరీ వచ్చింది. రూ.200 చెప్పిన వాచ్ ను రూ.180కి కొనేశాడు. అంటే రూ.20 లు లాభం అన్నమాట. అన్ని కోట్ల ఆస్తులు ఉన్న ఆ క్రికెటర్ ఎవరు? అతనెందుకు ఫుట్‌పాత్‌పై వస్తువులు కొన్నాడో తెలుసుకోవాలనుంది కదూ..

ఇతని పేరు మాథ్యూ హేడెన్. ఆస్ట్రేలియాకు చెందిన సక్సెస్‌ఫుల్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌లో హేడెన్ కూడా ఒకడనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐపీఎల్‌లో భాగంగా తొలి మూడేళ్లు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తరఫున ఆడి..తర్వాత క్రికెట్‌కు గుడ్ బై చెప్పి ప్రస్తుతం కామెంట్రీ ఇవ్వడానికి మరోసారి ఇండియా వచ్చాడు.

ఈ సందర్భంగా తనను ఎవరూ గుర్తు పట్టకూడదని గెటప్ మార్చి..డిఫరెంట్ గా రెడీ అయ్యాడు. లుంగీ కట్టుకొని, గడ్డం, మీసం పెట్టుకున్నాడు. చెన్నైలోని టీనగర్ స్ట్రీట్ మాల్‌లో షాపింగ్ కు బయలుదేరాడు. ఈ సీక్రెట్ షాపింగ్ ఎందుకు చేశాడంటే.. ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్ .. హేడెన్‌కు ఓ సవాలు విసిరాడు. చెన్నైలో రూ.1000లోపు ఉన్న వస్తువులు కొనాలన్నది ఆ చాలెంజ్. దీంతో హేడెన్ వెంటనే టీ నగర్‌ మార్కెట్ పై పడ్డాడు. అక్కడ రూ. వెయ్యికి లోపుగా విలువున్న లుంగీలు, షర్ట్‌లు, వాచ్‌లు కొన్నాడు. స్థానికంగా ఉండే ఓ యువకుడు అతనికి షాపింగ్ చేయడంలో సాయం చేశాడు. ఓ వాచ్ కోసం హేడెన్ బేరమాడుతున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇది వైరల్ గా మారింది.