Gst Collections
GST Collections: కరోనా కష్టకాలంలో కూడా జీఎస్టీ వసూళ్లు తగ్గలేదు. వరుసగా ఎనిమిదవ నెలలోను జీఎస్టీ వసూళ్లు రూ. లక్ష కోట్లు దాటాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మే నెలలో రూ.1,02,709 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. అయితే ఏప్రిల్ నెలలతో పోలిస్తే మే నెలలో 28 శాతం పడిపోయాయి.
28 శాతం తగ్గడానికి కరోనా లాక్ డౌన్ కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక 2020 మే నెలతో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో 65 శాతం జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. మే నెల మొత్తం జీఎస్టీ వసూళ్లలో రూ.17,592 కోట్లు సీజీఎస్టీ కాగా, రూ 22,653 కోట్లు ఎస్ జీఎస్టీ. ఇక ఉమ్మడి జీఎస్టీ రూ.53,199 కోట్లు వచ్చాయి.
సెస్ కింద మే నెలలో రూ.9,265 కోట్లు వసూలయ్యాయి. లాక్ డౌన్ లో కూడా ఇంతమొత్తంలో జీఎస్టీ వసూళ్లు కావడం అంటే ఆర్ధిక కార్యకలాపాలపై లాక్ డౌన్ ప్రభావం అంచనా వేసిన దానికంటే తక్కువే ఉందని డెలాయిట్ ఇండియా సీనియర్ డైరెక్టర్ ఎంఎస్ మణి అన్నారు.