అందంగా కన్పించేందుకు : మాయా రోజూ ఫేసియల్ చేయించుకుంటది

బీఎస్పీ అధినేత్రి మాయావతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు ఉత్తరప్రదేశ్ రోహనియా బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర నారాయణ్ సింగ్.60 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ గా కనిపించేందుకు మాయావతి రోజూ ఫేసియల్ చేయించుకుంటారని,జుట్టుకు రంగు వేసుకుంటారని మంగళవారం(మార్చి-19,2019) సురేంద్ర నారాయణ్ అన్నారు.
Read Also : మాల్యాకు మాగుంటకు లింకేటి? వైసీపీపై ట్రోలింగ్

మాయా తల వెంటుక్రలు నరుస్తున్నా.. ఆమె హఎయిర్ డై వేసుకుని నలుపురంగులో మెరిసేలా చేసుకుంటున్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాయల్ లైఫ్ అనుభవిస్తున్నాడని,ఓట్ల కోసమే ఛాయ్ వాలా అని చెప్పుకుంటారని,దేశం నిజంగా మారుతుందా అంటూ మాయావతి చేసిన ట్వీట్ కు కౌంటర్ గా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.