National Press Day : జర్నలిస్ట్ లపై రాష్ట్రపతి ప్రశంసలు

Media persons played important role in educating people, mitigating impact of COVID-19: Kovind జర్నలిస్టులపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రశంసలు కురిపించారు. కరోనాపోరాటంలో జర్నలిస్టులు కూడా ముందువరుసలో నిలబడ్డారని కోవింద్ అన్నారు. కరోనా విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడం,కరోనా ప్రభావాన్ని తగ్గించడంలో జర్నలిస్టులు ముఖ్యమైన పాత్ర పోషించారని కోవింద్ అన్నారు.



ఇవాళ(నవంబర్-16,2020)జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా లిఖితపూర్వక మెసేజ్ ద్వారా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(PCI)కి లిఖితపూర్వక మెసేజ్ ద్వారా అభినందనలు తెలిపారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. “కరోనా సమయంలో మీడియా పాత్ర మరియు మీడియాపై దాని ప్రభావం” అనే థీమ్ తో ప్రెస్ కౌన్సిల్ ఆప్ ఇండియా నవంబర్-16న నేషనల్ ప్రెస్ డే ని సెలబ్రేట్ చేస్తున్నట్లు తెలుసుకొని తాను సంతోషించానని కోవింద్ తెలిపారు.



PCI తన దాదాపు 55ఏళ్ల సర్వీసులో నాణ్యమైన జర్నలిజం అందించేందుకు ప్రయత్నిస్తూ పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు వాచ్ డాగ్ లా పనిచేస్తుందని కోవింద్ అన్నారు. మన ప్రజాస్వామ్యంలో పీసీఐ పాత్ర ముఖ్యమైనదని కోవింద్ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు