దేశంలోనే ఫస్ట్ టైమ్ : ఓన్లీ లేడీస్ పొలిటికల్ పార్టీ

ఇప్పటివరకు మీరు ఎన్నో రాజకీయ పార్టీలను చూసి ఉంటారు. అందులో స్త్రీలు, పురుషులు ఉండటం కామన్. లింగ భేదాలు కనిపించవు. కానీ ప్రత్యేకంగా మహిళల కోసమే వచ్చిన

  • Publish Date - January 29, 2019 / 04:30 PM IST

ఇప్పటివరకు మీరు ఎన్నో రాజకీయ పార్టీలను చూసి ఉంటారు. అందులో స్త్రీలు, పురుషులు ఉండటం కామన్. లింగ భేదాలు కనిపించవు. కానీ ప్రత్యేకంగా మహిళల కోసమే వచ్చిన

ఇప్పటివరకు మీరు ఎన్నో రాజకీయ పార్టీలను చూసి ఉంటారు. అందులో స్త్రీలు, పురుషులు ఉండటం కామన్. లింగ భేదాలు కనిపించవు. కానీ ప్రత్యేకంగా మహిళల కోసమే వచ్చిన పొలిటికల్ పార్టీని చూశారా? కనీసం విన్నారా? లేదు కదూ. కానీ ఇప్పుడు అదే జరిగింది. ఓన్లీ లేడీస్ కోసం ఓ రాజకీయ పార్టీ ఏర్పాటైంది.

 

నేషనల్ ఉమెన్స్ పార్టీ.. మహిళల కోసం మాత్రమే. హైదరాబాద్‌‌లో డాక్టర్‌గా పని చేసే 42ఏళ్ల శ్వేతా శెట్టి 2018 డిసెంబర్‌లో ఈ రాజకీయ పార్టీని స్థాపించారు. రీసెంట్‌గా దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ లాంచ్ చేశారు. 2012లో పార్టీ పేరు రిజిస్ట్రర్ చేయించారు. లక్ష 45వేల మంది సభ్యులు ఉన్నారు.

 

స్వాతంత్ర్యం వచ్చి 72ఏళ్లు కావొస్తున్నా ఇంకా మహిళలు వివక్ష ఎదుర్కొంటున్నారని శ్వేతారెడ్డి వాపోతున్నారు. ఇప్పటివరకు ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి అయినా చట్టసభల్లో ఎక్కువగా మహిళలు లేకపోవడం సీరియస్‌గా ఆలోచన చేయాల్సిన విషయం అంటారు. పురుషుల కన్నా మహిళలు ఎందులో తక్కువ అని శ్వేతా శెట్టి ప్రశ్నిస్తారు. పురుషులతో పాటు మహిళలకు కూడా సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తారు. పురుషాధిక్య ప్రపంచంలో మహిళలు వివక్షకు గురవుతున్నారని, ఇలాంటి పరిస్థితి మారాలని శ్వేతా శెట్టి కోరుకుంటారు.

 

ప్రతిదానికి మహిళలు పురుషులపై ఆధారపడాల్సిన పరిస్థితిలో మార్పు రావాలని శ్వేతా శెట్టి ఆశిస్తున్నారు. స్త్రీ, పురుష వివక్ష మీద శ్వేతా శెట్టి పోరాటం చేస్తున్నారు. రాజకీయాల్లో పురుషుల ఆధిప్యతం ఎక్కువగా ఉందనే శ్వేత.. రాజకీయాల్లో మహిళలకు కూడా ప్లాట్‌ఫామ్ కల్పించాలనే లక్ష్యంతో పార్టీని నెలకొల్పానని చెప్పారు. మహిళల కోసం కూడా ఓ పార్టీ ఉంటే టికెట్ కోసం పురుషులను మహిళలు అడుక్కోవాల్సిన దుస్థితి ఉండదన్నారు.

 

మహిళా రిజర్వేషన్ బిల్లుని ఎప్పుడు ఆమోదిస్తారని శ్వేతా శెట్టి ప్రశ్నిస్తున్నారు. చటసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1996 నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లు పెండింగ్‌లో ఉంచడం శోచనీయమన్నారు. ప్రస్తుతం పార్లమెంటు ఉభయసభల్లో 11శాతం మంది మహిళలే ఉన్నారని చెప్పారు. 542మంది సభ్యులు ఉండే లోక్‌సభలో కేవలం 64మంది మహిళా ఎంపీలు మాత్రమే ఉన్నారని తెలిపారు. 245మంది సభ్యులు ఉండే రాజ్యసభలో కేవలం 27మంది మాత్రమే మహిళా ఎంపీలు ఉండటం పరిస్థితికి అద్దం పడుతుందన్నారు.

 

విద్య, ఉద్యోగ రంగాల్లో మహిళలు వివక్ష ఎదుర్కొంటున్నారని శ్వేతా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలు తయారు చేసే వారు మహిళల గురించి ఆలోచన చేయరని అన్నారు. చట్టసభల్లో ఎక్కువమంది మహిళలు ఉంటే.. మహిళా సమస్యల గురించి మరింత గట్టిగా గళం వినిపించొచ్చని చెప్పారు. తెలంగాణ మహిళా సమితి పేరుతో ఎన్జీవోను స్థాపించిన శ్వేతా శెట్టి.. మహిళలు, అనాథలకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తామని, మా పార్టీ సత్తా ఏంటో చూపిస్తామని శ్వేతా శెట్టి ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని ఆమె తెలిపారు.