మేఘాలయ మైనర్ల ఘటన : మరొకరి మృతదేహం లభ్యం

మేఘాలయ మైనర్ల ఘటనలో మరో గుర్తుతెలియని బాడీని రెస్కూ టీం బుధవారం(ఫిబ్రవరి-27,2019) బయటకు తీసింది. తూర్పు జయంతియా హిల్స్ లోని లైటిన్ నది దగ్గర్లోని శాన్ దగ్గర ఉన్న గని నుంచి  మృతదేహాన్ని బయటకు తీశారు. 2018 డిసెంబర్-13న తూర్పు జయంతియా జిల్లాలోని లుంతరీ గ్రామంలోని బొగ్గు గనులను అక్రమంగా తవ్వుతుండగా ఆ ప్రాంతానికి దగ్గర్లోని లైటిన్ నది నీరు సొరంగంలోకి వచ్చి చేరడంతో 13మంది మైనర్ బాలురు అందులో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి చిక్కుకుపోయిన మైనర్ల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఏదైనా అద్భుతం జరుగవచ్చు, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాలని సుప్రీం కోర్టు కూడా తెలిపింది. 2019 జనవరిలో ఒక మృతదేహాన్ని రెస్క్యూ టీం బయటకు తీసింది.

ట్రెండింగ్ వార్తలు