Curfew In Shillong : మేఘాలయాలో విధ్వంసం, కర్ఫ్యూ..హోం మంత్రి రాజీనామా

ఈశాన్య రాష్ట్రం మేఘాలయ అట్టుడుకుతోంది. ఘటనలకు బాధ్యత వహిస్తూ మేఘాలయ హోంమంత్రి లక్మెన్ రైంబుయ్ తన పదవికి రాజీనామా చేశారు.

Meghalaya

Meghalaya : ఈశాన్య రాష్ట్రం మేఘాలయ అట్టుడుకుతోంది. నిషేధిత తీవ్రవాద సంస్థ నేషనల్ లిబరేషన్ కౌన్సిల్ నేత చెరిస్టర్‌ఫీల్డ్ ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ.. అతని మద్దతుదారులు రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌ తదితర ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసు వాహనాన్ని తగలబెట్టారు. దీంతో అప్రమత్తమైన అధికారులు షిల్లాంగ్‌లో ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ నిలిపివేశారు.

Read More : Earthquake : భూకంపానికి హైతీ విలవిల, 1300 మంది మృతి

ఇక ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ మేఘాలయ హోంమంత్రి లక్మెన్ రైంబుయ్ తన పదవికి రాజీనామా చేశారు. అటు చెరిస్టర్‌ఫీల్డ్‌ ఎన్‌కౌంటర్‌పై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికడంతో.. ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. ఇటు మేఘాలయ మానవ హక్కుల కమిషన్ దీన్ని సుమోటో కేసుగా విచారణకు స్వీకరించింది. దీనిపై 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక అందించాల్సిందిగా చీఫ్ సెక్రటరీని కోరింది.

Read More : TTD : దేవస్థానంలో జంబో కమిటీ, అదృష్టవంతులెవరో

చెరిస్టర్‌ఫీల్డ్‌ నేషనల్ లిబరేషన్ కౌన్సిల్ వ్యవస్థాపకుల్లో ఒకరు. మేఘాలయ గడ్డపై ఇతర రాష్ట్రాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా అతను పోరాడినట్లుగా ఆయన మద్దతుదారులు చెబుతారు. ఇటీవలి లైతుమ్‌ఖ్రహ్ పేలుళ్లతో ఆయనకు లింకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అతని ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించగా… చెరిస్టర్‌ వారిపై కత్తితో దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు అతడిపై కాల్పులు జరపడంతో చనిపోయాడు.