Smell of Alcohol: ఆల్కహాల్ వాసన వచ్చినంత మాత్రాన మత్తులో మునిగిపోయినట్లు కాదు – కేరళ హైకోర్టు

ఎటువంటి న్యూసెన్స్ చేయకుండా ప్రైవేట్ ప్లేసుల్లో మద్యం తీసుకోవడమనేది శిక్షార్హం కాదని చెప్తుంది కేరళ హైకోర్టు. 'ఆల్కహాల్ వాసన వచ్చినంత మాత్రాన ఆ వ్యక్తి.. మత్తులో ఉన్నట్లు కాదు.

Kerala Hc

Smell of Alcohol: ఎటువంటి న్యూసెన్స్ చేయకుండా ప్రైవేట్ ప్లేసుల్లో మద్యం తీసుకోవడమనేది శిక్షార్హం కాదని చెప్తుంది కేరళ హైకోర్టు. ‘ఆల్కహాల్ వాసన వచ్చినంత మాత్రాన ఆ వ్యక్తి.. మత్తులో మునిగిపోయినట్లు కాదు. లిక్కర్ ప్రభావంతో  మాత్రమే ప్రవర్తిస్తున్నట్లు కాదని’ జస్టిస్ సోఫీ థామస్ అన్నారు.

కొల్లం వాసి అయిన సలీమ్ కుమార్ వేసిన పిటిషన్ పై విచారణ జరిపింది సింగిల్ బెంచ్ జస్టిస్. ఫిబ్రవరి 2013న బడియాడ్క స్టేషన్ లో ఈ విషయంలో కేసు నమోదైంది. విలేజ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కుమార్.. ఆల్కహాల్ తీసుకున్నట్లుగా పరిగణిస్తూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ కు తీసుకువచ్చిన సమయంలో ఆల్కహాల్ మత్తులో ఉన్నాడని సెక్షన్ 118(a) ప్రకారం.. కేసు ఫైల్ చేశారు.

బ్లాక్ లా డిక్షనరీ ప్రకారం.. ఇన్‌టాక్సికేషన్ అంటే ఆల్కహాల్ లేదా డ్రగ్స్ తీసుకోవడం వల్ల పూర్తి మానసిక, శారీరక సామర్థ్యాలు తగ్గిపోవడం. అని జస్టిస్ చెప్పారు. అతను మద్యం తీసుకుని ఏదైనా న్యూసెన్స్ లేదా పోలీస్ స్టేషన్ లో మరే రకమైన అల్లరి సృష్టించినప్పుడు మాత్రమే సీరియస్ గా తీసుకునే వాళ్లమని కోర్టు స్పష్టం చేసింది.

 

…………………………….. : శబరిమలకి RTC బస్సులు..ప్రతీ బస్సులో ఐదుగురికి ఉచిత ప్రయాణం