Sabarimala RTC : శబరిమలకి RTC బస్సులు..ప్రతీ బస్సులో ఐదుగురికి ఉచిత ప్రయాణం

అయ్యప్ప భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. శబరిమలకు ఆర్టీసీ బస్సుల సౌకర్యం కల్పించింది. బస్సు బుక్ చేసుకుంటే ప్రతీ బస్సుకు ఐదుగురికి ఉచిత ప్రయాణం అని ప్రకటించింది.

Sabarimala RTC : శబరిమలకి RTC బస్సులు..ప్రతీ బస్సులో ఐదుగురికి ఉచిత ప్రయాణం

Sabarimala Rtc (1)

Sabarimala T.RTC bus services : అయ్యప్ప భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. అయ్యప్ప స్వామిని దర్శిచుకోవటానికి మాలధారణతో వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ బస్సు సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాదు ప్రతీ బస్సులోను ఐదుగురికి ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపింది. ఆర్టీసీ ఛైర్మన్ గా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించాక ఆర్టీసీ ఆదాయం పెంచటానికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంట్లో భాగంగానే అయ్యప్పస్వామి భక్తుల కోసం ఓ ఆఫర్ ప్రకటించింది. శబరిమలకి వెళ్లే భక్తులు ఆర్టీసీ బస్సును బుక్‌ చేసుకుంటే అదే బస్సులో మరో ఐదుగురికి ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించింది. ఇప్పటికే కార్తీక మాసం ప్రత్యేక బస్సులను నడుపుతున్న ఆర్టీసీ తాజాగా అయ్యప్ప స్వాముల కోసం శబరిమలకి బస్సు సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించింది.

ఐదుగురికి ఫ్రీ ఆఫర్ ప్రకటించిన టీ. ఆర్టీసి
కేరళ రాష్ట్రంలో కొలువైన అయ్యప్పను దర్శించుకోవటానికి స్వాములంతా బయలుదేరి వెళ్లనున్నారు. శీతాకాలం వచ్చిదంటే చాలు ఎక్కడ చూసినా నల్లని వస్త్రాలు ధరించి మెడలో అయ్యప్ప మాలలు ధరించి అయ్యప్ప భక్తులు కనిపిస్తారు. దీక్ష ముగిసాక అయ్యప్పస్వామిని దర్శించుకుంటారు. అనంతరం మాలను తొలగిస్తారు. అలా అయ్యప్పస్వామిని దర్శించుకోవటానికి వెళ్లే అయ్యప్ప భక్తులకు తెలంగాణ ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించింది. శబరిమలకి వెళ్లే భక్తులు ఆర్టీసీ బస్సును బుక్‌ చేసుకుంటే అదే బస్సులో మరో ఐదుగురికి ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. వరంగల్‌ 1 డిపో తరఫున ట్విట్టర్‌లో ప్రచారం కూడా మొదలు పెట్టారు. బుక్‌ చేసుకున్న బస్సులో అయ్యప్ప భక్తులతో పాటు ఇద్దరు వంట మనుషులు, ఒక అటెండర్‌, పదేళ్లలోపు ఇద్దరు మునికంట స్వాములకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఆ‍ర్టీసీ అంటోంది. మొత్తంగా మూడు ఫుల్‌ టిక్కెట్లు, రెండు ఆఫ్‌ టిక్కెట్లకు ఎటువంటి చార్జీలు వసూలు చేయడం లేదు.

ఛార్జీల ధరలు ఇలా ఉంటాయి..
శబరిమలైకి వెళ్లే భక్తులు అయ్యప్ప దర్శనంతో పాటు ఇతర పుణ్యక్షేత్రాలను కూడా సందర్శిస్తుంటారు. ఈ టూర్‌కి అనుగుణంగా ఆర్టీసీ కిలోమీటర్ల వంతున ఛార్జీలు నిర్ణయించింది. వీటితో పాటు ప్రతీ గంటకు రూ.300ల వంతున వెయిటింగ్‌ ఛార్జీ కూడా ఉంటుంది. గంటకు సగటున 30 కిలోమీటర్ల చొప్పున ప్రయాణ సమయాన్ని లెక్కిస్తున్నారు. ఆర్టీసీ శబరిమలై బస్సుల ఛార్జీలు ఇలా ఉన్నాయి.

-36 సీట్ల సూపర్‌ లగ్జరీ బస్సులకు కిలోమీటరుకు రూ.48.96
-40 సీట్లు ఉన్న డీలక్స్‌ బస్సులకు కిలోమీటరుకు రూ.47.20
-48 సీట్లు ఉన్న డీలక్స్‌ బస్సులకు కిలోమీటరుకు రూ.56.64
-49 సీట్లు ఉన్న ఆర్టీసీ బస్సులకు కిలోమీటరుకు రూ.52.49

కాగా..కార్తీక మాసం రావడంతో పల్లె పట్నం తేడా లేకుండా అయ్యప్పమాల ధరించిన వారే కనిపిస్తున్నారు. స్వామియే శరణం అయ్యప్పా అంటూ స్వాముల గీతాలు వినిస్తుననాయి. భక్తులు అయ్యప్ప మాల విరణమ కోసం శబరిమలకి వెళ్తుంటారు. ఇలా వేళ్లే వారు ఇప్పటి వరకు ఎక్కువగా ప్రైవేటు వెహికల్స్‌నే ఆశ్రయిస్తున్నారు. పలు ప్రమాదాలకు కూడా గురవుతున్నారు. ఈక్రమంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం క్షేమకరం అంటూ తెలంగాణ ఆర్టీసి అయ్యప్ప భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.