Mumbai : వాకింగ్ స్టిక్‌తో చిరుతతో మహిళ పోరాటం.. చివరికి

మెల్లి..మెల్లిగా నడుచుకుంటూ..వచ్చిన చిరుత..ఒక్కసారిగా ఆమెపై దాడికి పాల్పడింది. భయపడిపోయిన ఆమె..కేకలు వేసింది.

Mumbai

Fights Off Leopard : చిరుత, పులి..సింహం..ప్రమాదకరమైన జంతువులు. వీటికి ఎదురపడ్డామా అంతే సంగతులు. అమాంతం మీద పడి దాడులకు పాల్పడుతుంటాయి. బతుకు జీవుడా..అని వాటి బారి నుంచి కొంతమంది ప్రాణాలు కాపాడుకుంటుంటారు. మరికొంతమంది బలవుతుంటారు. తాజాగా..ఒంటరిగా కూర్చొన్న ఓ మహిళపైకి దాడి చేసేందుకు చిరుత యత్నించింది. వాకింగ్ స్టిక్ తో దానితో పోరాడింది. దీనికి సంబంధించిన విజువల్స్ సమీప సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

Read More : Bhadrachalam : వీటిని కూడా వదలడం లేదు, రాములోరి గుళ్లో 400 లడ్డూలు మాయం

సోషల్ మీడియాలో పోస్టు కావడంతో వైరల్ అయ్యాయి. ఆమె ధైర్యానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దేశ వాణిజ్య నగరమైన ముంబాయి.. Aarey colonyలో బుధవారం సాయంత్రం ఒంటరిగా ఓ మధ్యవయస్సురాలైన మహిళ కూర్చొని ఉంది. పక్కనే వాకింగ్ స్టిక్ పెట్టుకుని ఉంది. ఈమె వెనుకాలో చిరుత ఉంది. కానీ..ఆమె గమనించలేపోయారు. మెల్లి..మెల్లిగా నడుచుకుంటూ..వచ్చిన చిరుత..ఒక్కసారిగా ఆమెపై దాడికి పాల్పడింది. భయపడిపోయిన ఆమె..కేకలు వేసింది. ఒక్క పంజాతో ఆమెను కిందపడేసింది. వెంటనే తేరుకున్న ఆమె..వాకింగ్ స్టిక్ తో కొట్టడం ప్రారంభించింది. కేకలు వేస్తూ..కొట్టడంతో చిరుత వెనుకంజ వేసింది.

Read More : Bigg Boss 5 : చెత్తలో ఫుడ్ తినేందుకు ట్రై చేసిన లోబో..బిగ్ బాస్‌‌లో ఆకలి మంటలు

ఆమె కేకలు విని స్థానికులు రావడంతో చిరుత పారిపోయింది. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. Aruneel Sadadekar అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఆమె ధైర్యాన్ని ప్రశంసించారు. దాడిలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఈమె 55 ఏళ్ల నిర్మలాదేవిగా గుర్తించారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం..ఇంటి బయట ఆడుకుంటున్న…నాలుగేళ్ల చిన్నారిపై చిరుత దాడికి పాల్పడింది. బాలుడిని లాగడానికి ప్రయత్నించగా..స్థానికులు రావడంతో..చిరుత పారిపోయింది.