Kashmir : శ్రీనగర్ లో మరో ఉగ్రదాడి..సీఆర్పీఎఫ్ క్యాంప్ వద్ద గ్రనేడ్ విసిరిన టెర్రరిస్టులు

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్పిపోతున్నారు. కొద్ది రోజులుగా శ్రీనగర్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో వరుస దాడులకు తెగబడుతున్నారు.

Kashmir (5)

Srinagar జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్పిపోతున్నారు. కొద్ది రోజులుగా శ్రీనగర్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో వరుస దాడులకు తెగబడుతున్నారు. తాజాగా గురువారం సాయంత్రం శ్రీనగర్ లోని సఫకాదల్ వద్దనున్న సీఆర్పీఎఫ్ క్యాంప్ బయట గుర్తుతెలియని ఉగ్రవాదులు గ్రనేడ్ విసిరి పారిపోయారు. అయితే గ్రనేడ్ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదని ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. గ్రనేడ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

ఇక,రెండు రోజులుగా కశ్మీర్ లో మైనార్టీలే(సిక్కు,హిందువులు) లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం శ్రీనగర్ లోని ఈద్గా ఏరియాలో ఓ స్కూల్ లోకి చొరబడిన ఉగ్రదాదులు సిక్కు,హిందూ కమ్యూనిటీకి చెందిన ఇద్దరు టీచర్లు(మహిళ కూడా)- సతీందర్ కౌర్.దీపక్ చంద్ లను కాల్చి చంపిన విషయం తెలిసిందే. ముస్లిం టీచర్లను గ్రూపు నుంచి వేరు చేసి…ముస్లిమేతర టీచర్లను స్కూల్ నుంచి బయటకు లాగి అనంతరం వారిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు ఉగ్రవాదులు.

ఇక,మంగళవారం రాత్రి శ్రీనగర్ లో వేర్వేరు చోట్ల తీవ్రవాదులు దాడులు చేసి ముగ్గురిని హత్య చేసిన విషయం తెలిసిందే. గంట వ్యవధిలో ఈ ముగ్గురిని ముష్కరులు తుపాకితో కాల్చి చంపారు. మంగళవారం శ్రీనగర్ లో ఓ ఫార్మసీ నడుపుతున్న కశ్మీరీ పండిట్ మఖన్​ లాల్​ బింద్రోను, హవల్​ ప్రాంతంలోని మదిన్​ సాహిబ్​ దగ్గర ఓ వీధివర్తకుడుని,లాల్‌బజార్ ప్రాంతంలో రోడ్డు పక్కన బేల్పూరిని విక్రయించే ఓ స్థానికేతరుడిని ఉగ్రవాదులు కాల్పి చంపేశారు.

కాగా,కశ్మీర్ లో ఇటీవల కాలంలో పౌరులు.. ప్రధానంగా ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని దాడుల జరుగుతుండటం పట్ట నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం,ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్ లో 1990ల నాటి పరిస్థితులు మళ్లీ వచ్చాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1990ల్లో సమయంలో స్థానిక మరియు పాకిస్తాన్ మద్దుతుతో ఉగ్రవాదులు జరిపిన దాడుల కారణంగా కశ్మీర్ పండిట్ లు అనేక ఇబ్బందులు ఎదుర్కొని..చివరకు చాలావరకు కశ్మీర్ పండిట్ లు కశ్మీర్ ప్రాంతాన్ని ఖాళీ చేసి రాత్రికి రాత్రి ఢిల్లీ,జమ్మూ సహా భారత్ లోని పలు ప్రాంతాలకు వలసవెళ్లిన విషయం తెలిసిందే.

ALSO READ   రెచ్చిపోతున్న ఉగ్రవాదులు, ప్రభుత్వ టీచర్లను కాల్చి చంపారు

ALSO READ  నా తండ్రి మరణం పట్ల కన్నీరు కార్చను… గన్‌మెన్‌లకు గౌరవమిచ్చినట్లే