Lakhimpur Violence : జర్నలిస్ట్‌పై బూతులతో విరుచుకుపడ్డ కేంద్రమంత్రి

అక్టోబర్-3,2021న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర హోం శాఖ సహాయమంత్రి, స్థానిక ఎంపీ

Lakhimpur Violence : అక్టోబర్-3,2021న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర హోం శాఖ సహాయమంత్రి, స్థానిక ఎంపీ అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారును పోనిచ్చిన ఘటనలో,అనంతం జరిగిన హింసాత్మక ఘర్షణల్లో కలిపి నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్ సహా మొత్తం ఎనిమిది మరణించిన విషయం తెలిసిందే.

ఈ ఘటనలో ప్రధాన నిందితుడు అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ ఇప్పటికే అరెస్టయ్యారు. ఈ దుర్ఘటనపై దర్యాప్తు కోసం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించగా….సోమవారం కోర్టు ముందు సిట్ చార్జ్‌షీట్ ను సమర్పించింది. రైతులపైకి ఉద్దేశపూర్వకంగా కారు ఎక్కించారని ఇది కావాలని పన్నిన కుట్ర అని అందులో సిట్ పేర్కొన్న విషయం తెలిసిందే.

అయితే ఇవాళ కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రా లఖింపూర్‌ ఖేరీలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్థానిక జర్నలిస్టు ఒకరు సిట్ చార్జ్‌షీట్ గురించి ప్రశ్నించగా కేంద్రమంత్రి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. జర్నలిస్ట్ ప్రశ్న పూర్తి కాకముందే అజయ్ మిశ్రా రెచ్చిపోయారు. సదరు జర్నలిస్టును దుర్భషలాడుతూ దాడికి సైతం పాల్పడ్డారు. ‘‘దిమాగ్ కరాబ్ హై క్యా బే’, ‘మైక్ బంద్ కర్ బే’, ‘చోర్’ అంటూ బూతులు తిడుతూ ప్రశ్నించిన జర్నలిస్ట్ చేతిలో నుంచి మైక్‌ను లాగి బయటికి విసిరేరారు.

సదరు జర్నలిస్ట్ ఏమీ చేయలేక అలా నిల్చునున్నాడు. అయినప్పటికీ అజయ్ మిశ్రా కోపం తగ్గలేదు.ఈ కేసు విషయంలో ఏం తెలుసుకోవాలనుకుంటున్నావ్ అంటూ ఎదురుదాడికి దిగారు. జర్నలిస్ట్‌ను బూతులు తిడుతూనే అతడిని పలుమార్లు వెనక్కి బలంగా తోశారు. అక్కడే ఉన్న పోలీసులు కేంద్ర మంత్రిని ఆపే ప్రయత్నం చేయలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ALSO READ Sai Pallavi: బ్యూటీ విత్ నాచురాలిటీ సాయిపల్లవి.. గ్యాలరీ

ట్రెండింగ్ వార్తలు