Minister Amit shah: అమిత్ షాతో మంత్రి కేటీఆర్ భేటీ రద్దు.. కారణమేమంటే?

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భేటీ రద్దయింది.

Minister KTR

Minister KTR Delhi Tour: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (KTR) ఢిల్లీ (Delhi) పర్యటనలో ఉన్నారు. రెండురోజుల పర్యటనలో భాగంగా మంత్రి శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పలు అంశాలకు సంబంధించి కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తులు చేశారు. శనివారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్షదీప్ సింగ్ పురి, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో వేరువేరుగా సమావేశం అయ్యారు. అయితే, మంత్రి కేటీఆర్ శనివారం రాత్రి 10.15గంటలకు అమిత్ షాతో భేటీ కావాల్సి ఉంది. కానీ, ఈ భేటీ రద్దయింది.

Jairam Ramesh : మణిపూర్ హింసపై కేంద్ర అఖిలపక్ష సమావేశం కంటితుడుపు చర్య : జైరాం రమేష్

మంత్రి కేటీఆర్ రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో  భేటీ కావాల్సి ఉంది. ఈ మేరకు అమిత్ షా అపాయింట్‌మెంట్ కూడా ఫిక్స్ అయింది. హైదరాబాద్ రహదారుల విస్తరణకు కేంద్ర హోంశాఖ పరిధిలోని భూములు కోరడం, విభజన చట్టంలోని పలు అంశాలపై చర్చించేందుకు అమిత్ షా అపాయింట్ మెంట్ ను కేటీఆర్ కోరారు. మణిపూర్ హింసపై అఖిలపక్ష భేటీ, రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సమావేశం, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన బీజేపీ నాయకులతో సమావేశాలు ఇతర కార్యక్రమాల్లో అమిత్ షా శనివారం బిజీబిజీగా గడిపారు.

Janasena Symbol : జనసేనకు గాజుగ్లాస్‪ సింబల్‌ను కొనసాగించిన ఈసీ

ఈ క్రమంలో సమయం దాటిపోవటంతో పలు అపాయింట్‌మెంట్లను రద్దు చేసినట్లు తెలిసింది. ఇందులో మంత్రి కేటీఆర్ బృందం అపాయింట్‌మెంట్‌కూడా ఉంది. అపాయింట్‌మెంట్ రద్దుపై మంత్రి కేటీఆర్‌కు కేంద్ర హోంశాఖ అధికారులు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో మంత్రి కేటీఆర్ ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నారు.

ట్రెండింగ్ వార్తలు