MEA Driver: హనీ ట్రాప్‭లో విదేశాంగ శాఖ డ్రైవర్.. పాక్ మహిళకు రహస్యాల చేరవేత

ఆగస్టు 2022లో, పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై 46 ఏళ్ల వ్యక్తిని రాజస్థాన్ పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. ఆ వ్యక్తికి 2016లో భారత పౌరసత్వం లభించింది. భాగ్‌చంద్ అనే గూఢచారి పాకిస్తాన్‌లో జన్మించి 1998లో తన కుటుంబంతో సహా ఢిల్లీకి వచ్చాడు. అతను 2016లో భారత పౌరసత్వం పొందాడు. ఢిల్లీలో టాక్సీ డ్రైవర్‌గా, కార్మికుడిగా పని చేయడం ప్రారంభించాడు

MEA Driver: గూఢచర్యం ఆరోపణలపై న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ భవన్‌లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన డ్రైవర్‌ను అరెస్టు చేశారు. డబ్బుకు ఆశ పడి పూనమ్ శర్మ/పూజాగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్‭ మహిళకు దేశానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని చేరవేశాడనే ఆరోపణలు గుప్పు మంటున్నాయి. అతడిని ట్రాప్ చేయడానికి పాకిస్తాన్ గూఢచారి నకిలీ ఐడీని చూపించిందని, దాన్ని నమ్మి అతడు మోసపోయాడని సమాచారం. ఈ కేసులో విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేస్తోన్న మరికొంత మంది ఉద్యోగుల ప్రమేయం ఉందా లేదా అనే కోణంలో పోలీసులు, నిఘా సంస్థలు విచారణ ప్రారంభించాయి. అయితే, దీనిపై విదేశాంగ శాఖ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఆగస్టు 2022లో, పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై 46 ఏళ్ల వ్యక్తిని రాజస్థాన్ పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. ఆ వ్యక్తికి 2016లో భారత పౌరసత్వం లభించింది. భాగ్‌చంద్ అనే గూఢచారి పాకిస్తాన్‌లో జన్మించి 1998లో తన కుటుంబంతో సహా ఢిల్లీకి వచ్చాడు. అతను 2016లో భారత పౌరసత్వం పొందాడు. ఢిల్లీలో టాక్సీ డ్రైవర్‌గా, కార్మికుడిగా పని చేయడం ప్రారంభించాడు. పాకిస్తాన్‌లోని తన బంధువులకు కాంటాక్టులో ఉంటూ భారత రహస్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసేవాడు.

దీనికి ముందు అక్టోబర్‌లో, ‘బౌద్ధ సన్యాసి’ అని చెప్పుకునే 50 ఏళ్ల చైనా మహిళను గూఢచారి అనుమానంతో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కై రువోగా గుర్తించబడిన ఆ మహిళ.. చైనా కమ్యూనిస్ట్ నాయకులు తనను చంపాలనుకుంటున్నారని, అదుకే తాను పారిపోయి భారతదేశానికి వచ్చానని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించి గూఢచర్యం చేసిందట. మన దేశంలో ఆమె డోలా లామా, నేపాల్ జాతీయురాలుగా నివసించింది. అనంతరం ఒకసారి జరిగిన తనిఖీలో ఆమె పేరు మీద చైనా పాస్‌పోర్ట్ ఉందని, ఆ పాస్‌పోర్ట్ ఆధారంగానే ఆమె భారత్‌లో నివసిస్తున్నట్లు పోలీసులకు తెలిసి అరెస్ట్ చేశారు.

BJP Sting Operation: ఇంజనీర్ నుంచి ఆప్ అభ్యర్థి రూ.కోటి డిమాండ్.. ఆప్‭పై బీజేపీ సంచలన ఆరోపణలు

ట్రెండింగ్ వార్తలు