Miss world 2021 : మిస్ వరల్డ్ పోటీలు వాయిదా, హైదరాబాద్ మానసకు కరోనా

భారత్ తరపున పోటీ చేస్తున్న హైదరాబాదీ మానస వారణాసితో సహా అనేక దేశాల అందగత్తెలు కరోనా బారిన పడ్డారు.

Miss World 2021

Hyderabad Manasa Varanasi : కరోనా ప్రభావం మిస్ వరల్డ్ పోటీలపై పడింది. ప్యుర్టోరికోలో జరగాల్సిన పోటీలు వాయిదా పడ్డాయి. భారత్ తరపున పోటీ చేస్తున్న హైదరాబాదీ మానస వారణాసితో సహా అనేక దేశాల అందగత్తెలు కరోనా బారిన పడ్డారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ సిబ్బంది అనేక మందికి కూడా వైరస్ సోకింది. దీంతో పోటీలు వాయిదా వేశారు. వైరస్ బారిన పడ్డ వారందరినీ ప్యుర్టోరికోలో క్వారంటెయిన్‌కు తరలించారు. మళ్లీ పోటీలు 90 రోజులలోపు నిర్వహించనున్నారు. అందాల భామలతో పాటు..మిగిలిన కరోనా బాధితులంతా…వైరస్ నుంచి కోలుకోగానే స్వదేశాలకు చేరుకుంటారు.

Read More : Child artists : ఇకపై చైల్డ్ ఆర్టిస్టులు నటించాలి అంటే ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే.. సినీ పరిశ్రమకు మరో భారం

పోటీదారులు, ఇతర సిబ్బంది ఆరోగ్యాన్ని, భద్రతను దృష్టిలో పెట్టుకుని..మిస్ వరల్డ్ కంటెస్ట్ వాయిదా వేయాలని నిర్ణయించామని నిర్వాహకులు చెప్పారు. ఆరోగ్యశాఖ అధికారులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పోటీల కోసం ఎన్నోరోజుల ముందుగానే అందాల భామలు ప్యూర్టోరికో చేరుకున్నారు. ఇప్పుడు వారంతా స్వదేశాలకు పయనమవుతున్నారు. కరోనా బాధితులు వైరస్ నుంచి కోలుకోగానే సొంతదేశాలకు వెళ్తారు. మానస వారణాసి త్వరగా కోలుకోవాలని మిస్ ఇండియా ఆర్గనైజేషన్ ట్వీట్ చేసింది.

Read More : Winter Tips : చలికాలంలో ఆరోగ్య రక్షణ కోసం చిట్కాలు

ఆమె త్వరగా స్వదేశానికి వచ్చి..మరింత బలంగా మారి..తిరిగి వెళ్లి పోటీల్లో పాల్గొనాలని ఆకాంక్షించింది. హైదరాబాద్‌కు చెందిన మానస వారణాసి..ఈ ఏడాది మిస్ ఇండియాగా, మిస్ ర్యాంప్‌వాక్‌గా నిలిచారు. ప్రపంచ అందాల సుందరి కిరీటం ఆమెకు దక్కాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటం కూడా భారత్‌కే దక్కడంతో..మానస వారణాసి ప్రపంచ సుందరి కిరీటం తీసుకువస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు.