MoC Accounts : మదర్ థెరిసా మిషనరీల అకౌంట్లు ఫ్రీజ్..మమత ఆరోపణలకు కేంద్రం కౌంటర్

దేశంలో మదర్​ థెరిసా మిషనరీ ఆఫ్​ ఛారిటీ(MoC)ల అన్ని బ్యాంకు ఖాతాలను క్రిస్మస్ రోజున కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ

Mamata Moh

MoC Accounts : దేశంలో మదర్​ థెరిసా మిషనరీ ఆఫ్​ ఛారిటీ(MoC)ల అన్ని బ్యాంకు ఖాతాలను క్రిస్మస్ రోజున కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ స్పందించింది. సోమవారం కేంద్రహోంశాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో…”ఎంవోసీ యెక్క ఏ ఒక్క బ్యాంక్ అకౌంట్ ని హోంశాఖ నిలిపివేయలేదు. ఎంవోసీనే స్వయంగా తమ అకౌంట్లను నిలిపివేయాలంటూ ఎస్బీఐని అభ్యర్థించింది. ఈ నేపథ్యంలోనే ఎస్బీఐ..ఆ ఖాతాలను ఫ్రీజ్ చేసింది”అని మమత ఆరోపణలకు కౌంటర్ ఇచ్చింది కేంద్ర హోంశాఖ.

కాగా,FCRA 2010,FCRR 2011 అర్హత నిబంధలకు అనుగుణంగా లేవన్న కారణంతో ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద.. MoC చేసుకున్న రెన్యువల్ అప్లికేషన్ డిసెంబర్-25న తిరస్కరణకు గురైందని ప్రెస్ నోట్ లో భారత ప్రభుత్వం తెలిపింది. పునరుద్దరణ అప్లికేషన్ తిరస్కరణను రివ్యూ చేయాలని MoC నుంచి ఎలాంటి అభ్యర్థణ లేదని తెలిపింది. MoC యొక్క FCRA రిజిస్ట్రేషన్ వాలిడిటీ డిసెంబర్-31,2021 వరకు ఉందని తెలిపింది.

అయితే,సోమవారం మధ్యాహ్నాం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ఓ ట్వీట్ లో…”మదర్​ థెరిసా స్థాపించిన మిషనరీస్​ ఆఫ్​ ఛారిటీకి చెందిన అన్ని బ్యాంకు ఖాతాలను కేంద్రం స్తంభింపజేసిందనే వార్తను క్రిస్మస్​ రోజున వినటం దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో వాటిల్లోని 22వేల మంది రోగులు, ఉద్యోగులు. ఔషధాలు, ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారు. చట్టం ప్రధానమైనప్పటికీ, మానవతా ప్రయత్నాలలో ఎలాంటి రాజీ ఉండకూడదు”అని పేర్కొన్నారు. ఇక,ఈ విషయంపై కోల్​కతాలోని మిషనరీస్​ ఆఫ్​ ఛారిటీ కార్యాలయం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

ALSO READ India vs South Africa 1st Test : వర్షార్పణం..తొలి టెస్టు రెండో రోజు ఆట రద్దు