Assam
Akhil Gogoi : సత్యం గెలిచింది..తనను జైల్లో ఉంచాలన్న ప్రయత్నాలు బెడిసి కొట్టాయని అన్నారు సమాచారం హక్కు చట్టం కార్యకర్త, రైజోర్ దళ్ పార్టీ అధ్యక్షుడు అఖిల్ గొగొయ్. ఈయన జైలు నుంచి విడుదలయ్యారు. 2019 డిసెంబర్ లో సీఏఏ (CAA) వ్యతిరేక ఆందోళనల్లో భాగంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈయన రెండు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అనంతరం ఈయన్న అరెస్టు చేసి జైలుకు తరలించారు. అసోంలో జరిగిన ఎన్నికల్లో ఈయన బరిలో నిలిచారు. జైలు నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.
నమోదైన రెండు కేసుల్లోనూ…NIA కోర్టు తోసిపుచ్చడంతో దాదాపు ఏడాదిన్నరకాలం తర్వాత జైలు జీవితం నుంచి బయటపడ్డాడు. జైలు నుంచి బయటకు వచ్చిన గొగొయ్ కు అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ఇతరులు స్వాగతం పలికారు. ఎట్టకేలకు సత్యం గెలిచిందని, తన నియోజకవర్గమైన శివసాగర్ లో శుక్రవారం పర్యటిస్తానన్నారు. ప్రజలకు ధన్యవాదాలు చెప్పడం జరుగుతుందని, జైల్లో ఉంచడానికి తనపై ప్రయోగించిన ఉపా చట్టంపై పోరాటం చేస్తానని గొగొయ్ ప్రకటించారు.