Kamal Haasan
లోక్‌సభ ఎన్నికల వేళ మక్కల్ నీది మయ్యం అధినేత కమల హాసన్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యూడల్ పాలిటిక్స్ చేసే వారితో కాకుండా, దేశం కోసం నిస్వార్థంగా ఆలోచించే పార్టీలతో పొత్తు పెట్టుకుంటానని చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాలు వ్యాపారంగా మారాయని కమల హాసన్ అన్నారు. రాజకీయ నాయకులు వ్యాపారుల్లా మారారని చెప్పారు. పొత్తులపై తమిళనాడులో రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నారా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. ఇండియా కూటమిలో ఇప్పటివరకైతే భాగంకాలేదని కమల హాసన్ చెప్పారు.
కమల హాసన్ ఇండియా కూటమి వైపునకే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వంపై కమల హాస్ పదేపదే విమర్శలు చేస్తుంటారు. లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని వారాలే సమయం ఉండడంతో ఎన్డీఏ, ఇండియా కూటములు వీలైనన్ని పార్టీలను తమతో కలుపుకుని పోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.
Farmers Protest: చలో ఢిల్లీ నిరసనను 2 రోజులపాటు నిలిపివేస్తున్నట్లు రైతు సంఘాల ప్రకటన