Amazon warehouse ముంబైలోని అమెజాన్ గోడౌన్ ని మహారాష్ట్ర నవ్ నిర్మాన్ సేన్(MNS)వర్కర్లు ధ్వంసం చేశారు. అమెజాన్ ప్రమోషనల్ పోస్టర్స్ లో మరాఠీ బాషను ఉపయోగించాలని రాజ్ ఠాక్రే నేతృత్వంలోని MNS పలుసార్లు చేసిన హెచ్చరికలను అమెజాన్ పట్టించుకోకపోవడంతోనే ఇవాళ(డిసెంబర్-25,2020) ముంబైలోని చండివలి ఏరియాలోని అమెజాన్ గోడౌన్ ని ఎమ్ఎన్ఎస్ వర్కర్లు ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా, అమెజాన్ యాప్ లో కూడా మరాఠీ బాష ఆప్షన్ లేకపోవడంపై కూడా MNS పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మరోవైపు,MNS హెచ్చరికల నేపథ్యంలో డిండోషి కోర్టుని అమెజాన్ ఆశ్రయించింది. దీంతో జనవరి-5,2021లోపు కోర్టు ముందు హాజరుకావాలని రాజ్ ఠాక్రే సహా మరికొందరు MNS నేతలకు నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. అమెజాన్ కోర్టుని ఆశ్రయించడంతో కూడా ఆగ్రహించిన MNS కార్యకర్తలు ఇవాళ కంపెనీ గోడౌన్ ని ధ్వంసం చేసినట్లు సమాచారం.