Manipur : యువకుల హత్యపై పెల్లుబుకిన ఆగ్రహం..మణిపూర్‌లో బీజేపీ కార్యాలయం దహనం

మణిపూర్ రాష్ట్రంలో మళ్లీ హింసాకాండ మొదలైంది. మణిపూర్‌లో ఇద్దరు యువకుల హత్యకు నిరసనగా మణిపూర్‌లోని తౌబాల్‌లో బీజేపీ కార్యాలయాన్ని జనం తగలబెట్టారు. తౌబాల్ జిల్లా నడిబొడ్డున ఉన్న బీజేపీ కార్యాలయంపై పెద్ద ఎత్తున నిరసనకారులు దాడి చేశారు....

Mob burns BJP office

Manipur : మణిపూర్ రాష్ట్రంలో మళ్లీ హింసాకాండ మొదలైంది. మణిపూర్‌లో ఇద్దరు యువకుల హత్యకు నిరసనగా మణిపూర్‌లోని తౌబాల్‌లో బీజేపీ కార్యాలయాన్ని జనం తగలబెట్టారు. తౌబాల్ జిల్లా నడిబొడ్డున ఉన్న బీజేపీ కార్యాలయంపై పెద్ద ఎత్తున నిరసనకారులు దాడి చేశారు. ఆ గుంపు కార్యాలయం గేటును ధ్వంసం చేసి, అద్దాలను పగులగొట్టింది. (Mob burns down BJP office) బీజేపీ కార్యాలయం ఆవరణలో నిలిపి ఉంచిన వాహనం అద్దాలను కూడా ధ్వంసం చేశారు. ఆందోళనకారులు బీజేపీ కార్యాలయాన్ని దహనం చేశారు.

Telangana BJP : గోడ దూకేస్తారా? తెలంగాణ బీజేపీలో దుమారం, పార్టీని హడలెత్తిస్తున్న ఆ నలుగురు సీనియర్లు

నిరసనకారులు టైర్లను తగులబెట్టి, చెక్క దుంగలను ఇండో-మయన్మార్ హైవేపై వేసి ట్రాఫిక్ ను అడ్డుకున్నారు. రాళ్లు రువ్వుతున్న నిరసనకారులను చెదరగొట్టడానికి భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ షెల్ లు, మాక్ బాంబులు, లైవ్ బుల్లెట్లను ప్రయోగించారు. బీజేపీ కార్యాలయంపై దాడి జరగడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు జూన్‌ నెలలో రాష్ట్రంలో పెరుగుతున్న జాతి ఉద్రిక్తతల మధ్య దుండగులు మూడు బీజేపీ కార్యాలయాలను ధ్వంసం చేశారు.

TDP Leaders Tension : టీడీపీ-జనసేన పొత్తు.. టెన్షన్ పడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కారణం ఏంటంటే..

బిష్ణుపూర్‌తో సహా వివిధ జిల్లాల్లో విద్యార్థులు నిరసన ప్రదర్శనలు కూడా జరిపారు. ఇంఫాల్‌లో వరుసగా రెండో రోజు ఇద్దరు విద్యార్థులను కిడ్నాప్ చేసి చంపినందుకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. (protest over killing of youths) వందలాది మంది విద్యార్థులు బుధవారం మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ నివాసం వైపు కవాతు నిర్వహించారు.

Pakistan Cricket team: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు

రాష్ట్ర పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో సహా భద్రతా బలగాలు గుంపును చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ షెల్స్. పొగ బాంబులను ఉపయోగించాయి. జులై నెలలో కిడ్నాప్‌కు గురైన ఇద్దరు విద్యార్థుల హత్యకు వ్యతిరేకంగా విద్యార్థులు,ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సిబ్బందికి మధ్య జరిగిన ఘర్షణలో 45 మంది నిరసనకారులు గాయపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు