Mobile Phone Blast : బాబోయ్.. మాట్లాడుతుండగా పెద్ద శబ్దంతో పేలిపోయిన మొబైల్ ఫోన్

అమ్రోహాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ మొబైల్ ఫోన్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. తాను 4 నెలల క్రితం రూ.16వేలు పెట్టి ఫోన్ కొన్నానని బాధితుడు తెలిపాడు. దీనికి సంబంధించిన బిల్లు రసీదు కూడా అతడు చూపించాడు.

Mobile Phone Blast : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమ్రోహాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ మొబైల్ ఫోన్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. అదృష్టవశాత్తు యువకుడికి ఎలాంటి గాయాలు కాలేదు.

యూపీలోని అమ్రోహాలోని నౌగవానా సదత్ కొత్వాలి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ వ్యక్తి పేరు హిమాన్షు. ఫోన్ మాట్లాడుతుండగా.. ముందుగా పొగ వచ్చిందని, ఆ తర్వాత పెద్ద శబ్దంతో ఫోన్ పేలిపోయిందని అతడు తెలిపాడు. దీంతో తాను షాక్ కి గురయ్యానని అన్నాడు. ఆకస్మిక పేలుడు కారణంగా ఆ వ్యక్తి భయాందోళనకు గురయ్యాడు.

Also Read..Pregnant Women : గర్భిణీలు సెల్ ఫోన్ మాట్లాడితే…రేడియేషన్ ప్రభావం బిడ్డపై…

తాను 4 నెలల క్రితం రూ.16వేలు పెట్టి ఫోన్ కొన్నానని బాధితుడు తెలిపాడు. దీనికి సంబంధించిన బిల్లు రసీదు కూడా అతడు చూపించాడు. దీనిపై దుకాణదారుడికి ఫిర్యాదు చేశాడు. కాగా, అదృష్టవశాత్తు హిమాన్షుకి పెను ప్రమాదం తప్పింది.

”మొబైల్ నుంచి మొదట పొగ వచ్చింది. సెకన్లలో వ్యవధిలోనే పేలిపోయింది. శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. నాలుగు నెలల క్రితం అమ్రోహా నుంచి ఈ ఆండ్రాయిడ్ మొబైల్‌ను కొనుగోలు చేశాను. దీనిపై దుకాణదారుడికి ఫిర్యాదు చేస్తే అతడు నన్ను తిట్టాడు. దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు. దీనిపై కస్టమర్ కేర్‌లో ఫిర్యాదు చేశాను” అని బాధితుడు తెలిపాడు.

Also Read..e-Sim in Android: సిమ్ కార్డు లేకుండానే పనిచేసే ఆండ్రాయిడ్ 13 ఓఎస్: డబల్ సిమ్ కూడా ఓకే

హిజంపూర్ గ్రామ వాసి అయిన హిమాన్షు కుమార్ సుమారు 4 నెలల క్రితం రూ. 16వేలకి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ కొన్నాడు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుండగా ఒక్కసారిగా మొబైల్ నుంచి పొగ రావడం మొదలైంది. అలర్ట్ అయిన యువకుడు.. వెంటనే చెవి నుంచి ఫోన్ దూరంగా తీశాడు. ఆ వెంటనే పెద్ద శబ్దంతో మొబైల్ పేలింది. పేలుడు సంభవించిన వెంటనే యువకుడు భయాందోళనకు గురయ్యాడు. తాను ఎక్కడి నుంచి మొబైల్ కొన్నాడో ఆ దుకాణదారుడికి ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. దుకాణదారుడు అంగీకరించ లేదని చెప్పాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఫోన్ పేలుడు ఘటన స్థానికంగా కలకలం రేపింది. పెద్ద శబ్దంతో ఫోన్ పేలడం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. అసలు ఫోన్ ఎందుకు పేలింది? పేలుడికి కారణాలు ఏంటి? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 

పెద్ద శబ్దంతో పేలిపోయిన ఫోన్..